వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ప్రియమైన వారిని ఇంప్రెస్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటలు ఈ ప్రత్యేక సందర్భంగా కోసం ఎదురుచూస్తుంటారు. అయితే, మరోవైపు ఇష్టపడని వారు కూడా ఉంటారు. భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ట్విట్టర్‌లో #AskDK ప్రశ్నోత్తరాల సెషన్‌ను నిర్వహించాడు. అయితే, ఇందులో కొందరు అభిమానులు వాలెంటైన్స్ డే గురించి ప్రశ్నలు అడిగారు. వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా ఒకరితో గడపడానికి ఒక అభిమాని వికెట్ కీపర్ కం బ్యాటర్‌ని సహాయం అడిగాడు. దీంతో కార్తీక్ ఈ ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు.
ప్రస్తుతానికి దినేష్ కార్తీక్ వ్యాఖ్యతగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో కార్తీక్ వ్యాఖ్యత పాత్రలో కనిపించనున్నాడు.
తన ఖాళీ సమయంలో, కార్తీక్ ట్విట్టర్‌లో #AskDK సెషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని “సార్ ఈ సంవత్సరం వాలెంటైన్స్ డేని ఎవరితోనైనా జరుపుకోవడానికి నాకు సహాయం చెయ్యండి” అంటూ అడిగాడు. ప్రతిస్పందనగా, కార్తీక్ అద్దంలో ఒక వ్యక్తి తనను తాను చూసుకునే ఫొటోను పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.
https://t.co/l8HySGkFgp pic.twitter.com/nWBKWbmNeF
— DK (@DineshKarthik) February 7, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..