బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశాడంటూ.. నూతన అధ్యక్షుడిగా జైషా పదవీ బాధ్యతలను చేపట్టనున్నాడని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనాన్ని కొన్ని మీడియా హౌస్‌లు కూడా కవర్ చేయడంతో.. ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా సంచలనం రేగింది. అయితే ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని దాదా ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ట్వీట్ ఓ ఫేక్ బీసీసీఐ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిందని తేల్చారు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయలేదని.. ఈ పుకారును ఎవ్వరూ నమ్మొద్దని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వార్తపై బీసీసీఐ ఇంకా స్పందించాల్సి ఉంది.
? NEWS : Mr. Sourav Ganguly has resigned from the post of BCCI chairman citing personal reasons. We wish @SGanguly99 all the best for his future endeavours.
Mr. Jay Shah is the new BCCI chairman?#BCCI #TeamIndia
— BCCI (@_BCCII) August 10, 2022
This page is just for entertainment purpose. Kindly do not consider my tweets as real official news
— BCCI (@_BCCII) August 11, 2022