Vaibhav Suryavanshi: సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్‌లో ఫెయిలైన ఐపీఎల్ సెన్సేషన్..?

Vaibhav Suryavanshi, IPL 2025: క్రీడలలో హీరో, చదువులో మాత్రం జీరోగా మారాడని ఐపీఎల్ 2025 సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. టెన్త్ ఫెయిల్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇందులో నిజం ఎంతనేది ఇప్పుడు తెలుసుకుందాం..?

Vaibhav Suryavanshi: సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్‌లో ఫెయిలైన ఐపీఎల్ సెన్సేషన్..?
Vaibhav Suryavanshi

Updated on: May 20, 2025 | 8:37 AM

Vaibhav Suryavanshi: దేశవ్యాప్తంగా 10వ, 12వ తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించే సమయం ఆసన్నమైంది. CBSE, స్టేట్ బోర్డ్ ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇంతలో సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ ఫలితాలు మాత్రం వార్తలుగా మారాయి. అతను బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, వైభవ్ సూర్యవంశీ CBSE బోర్డు నుంచి 10వ తరగతి పరీక్షకు హాజరై విఫలమయ్యాడు. ఇప్పుడు అదే విషయం, క్రీడలలో హీరోగా నిలిచిన ఈ యంగ్ ప్లేయర్.. చదువులో మాత్రం జీరోగా నిలిచాడని కామెంట్లు చెబుతున్నారు. కానీ, బయటకు వచ్చిన వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం కూడా ముఖ్యం.

వైభవ్ సూర్యవంశీ బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడా?

సోషల్ మీడియా ప్రకారం వైభవ్ సూర్యవంశీ వైఫల్య వార్తలను పరిశీలిస్తే.. అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. అంటే, వైభవ్ సూర్యవంశీ బోర్డు పరీక్షలలో ఫెయిల్ కాలేదని తెలుస్తోంది. అంటే అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడా? లేదా? అనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు పరీక్షకు హాజరైనప్పుడే కదా ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అవ్వడం అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి అసలు వైభవ్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఇది వార్త కాదు.. ట్రోల్స్..

వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజానికి నిరాధారమైనవి. అందులో నిజం లేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన 10వ తరగతి CBSE బోర్డు పరీక్షలలో విఫలమయ్యాడని, అందుకే BCCI వైభవ్ ఆన్సర్ షీట్‌పై DRS సమీక్ష తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

వైభవ్ 10వ తరగతి విద్యార్థి కాదు..

అసలు విషయం ఏమిటంటే వైభవ్ సూర్యవంశీ ఇంకా 10వ తరగతికి చేరుకోలేదు. అతను 9వ తరగతి మాత్రమే చదువుతున్నాడు. అంటే అతని బోర్డు పరీక్షలకు ఇంకా సమయం ఉంది. 14 ఏళ్ల సూర్యవంశీ IPL 2025 సమయంలో 35 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 11 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ అనేది బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయిన వ్యక్తి పేరు కానేకాదండోయ్.. కానీ, టీ20 క్రికెట్ ప్రపంచంలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా మాత్రం పేరు సంపాధించాడన్నమాట.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..