IND vs ENG: మూడో టెస్టులో కోహ్లీ సేన పరాజయం.. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం..!

|

Aug 28, 2021 | 5:49 PM

మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లో వరుసగా వికెట్లు కోల్పోయి.. పరాజయం పాలైంది.

IND vs ENG: మూడో టెస్టులో కోహ్లీ సేన పరాజయం.. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం..!
Virat Kohli
Follow us on

IND vs ENG: మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లో వరుసగా వికెట్లు కోల్పోయి.. పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లండ్ టీం ఇన్నింగ్స్ 76 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య  నాలుగో టెస్ట్‌ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది. 7 వికెట్లు తీసిని రాబిన్ సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. పుజారా(91), కోహ్లీ(55), రహానె(10), రిషభ్‌ పంత్‌(1), షమీ(6), ఇషాంత్ శర్మ(2), సిరాజ్(0) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జడేజా (30) ఒక్కడే కొద్ది సేపు బౌండరీలతో అలరించాడు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 423 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు నుంచి ఇంగ్లండ్‌ టీం భారత్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్‌ (165 బంతుల్లో 121; 14 ఫోర్లు) మరో శతకం సాధించగా, డేవిడ్‌ మలాన్‌ (128 బంతుల్లో 70; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో షమీ 4, జడేజా, సిరాజ్‌, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో మిగతా 27 పరుగులు చేసి కుప్పకూలింది. కేఎల్ రాహుల్‌(0), చతేశ్వర్(1), విరాట్‌ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా తరపున రోహిత్‌ శర్మ(19) టాప్‌ స్కోరర్‌గా నిలవగా రహానె 18 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్‌ 3, రాబిన్సన్‌ 2, సామ్‌ కరన్‌ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను చావుదెబ్బ తీశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్ సన్ 5 వికెట్లు, క్రైగ్ 3, అలీ, అండర్ సన్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read:

IND Vs ENG: ఈసారి ఇండియాకి.. రోహిత్‌ శర్మ అవుట్‌ అయ్యాడు.. కోహ్లీ ప్లేస్‌లో ‘జార్వో’ మళ్లీ వచ్చేశాడు..

IND vs ENG 3rd Test Day 4: మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం.. సిరీస్ 1-1 తో సమానం

IND Vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్.. 354 పరుగుల భారీ ఆధిక్యం.. టీమిండియా నిలిచేనా..