India vs England : ఇంగ్లండ్‌ జట్టు ఒక్క టెస్ట్‌ కూడా గెలిచే అవకాశం లేదు.. జోష్యం చెప్పిన ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌

చెన్నై వేదికగా జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలిచే ఛాన్స్ లేదని టీమిండియా మాజీ ఓపెనర్‌, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ జోష్యం చెప్పారు. స్పిన్నర్‌లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై...

India vs England : ఇంగ్లండ్‌ జట్టు ఒక్క టెస్ట్‌ కూడా గెలిచే అవకాశం లేదు.. జోష్యం చెప్పిన ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌
Gautam Gambhir

Updated on: Feb 03, 2021 | 5:21 PM

India vs England : చెన్నై వేదికగా జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలిచే ఛాన్స్ లేదని టీమిండియా మాజీ ఓపెనర్‌, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ జోష్యం చెప్పారు. స్పిన్నర్‌లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్‌ జట్టు పేలవమైన స్పిన్‌ అటాక్‌తో బరిలోకి దిగుతుందని… ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశమని అన్నారు.

ఇంగ్లండ్‌ స్పిన్‌ విభాగానికి సారథ్య వహిస్తున్న మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని  అభిప్రాయపడ్డారు. 60 టెస్ట్‌ల్లో 181 వికెట్లు సాధించిన మొయిన్‌ అలీ ఒక్కడే భారత్‌పై చెప్పుకోదగ్గ ప్రభావం చూపగలడని అన్నారు. ఇంగ్లీష్‌ స్పిన్నర్లు డామ్‌ బెస్‌, జాక్‌ లీచ్‌లను భారత బ్యాట్స్‌మెన్లు ఓ పట్టు పడతారని ధీమా వ్యక్తం చేశారు.

చెరి 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అనుభవమున్నఈ ఇంగ్లండ్‌ స్పిన్నర్లపై టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఎదురుదాడికి దిగితే.. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3-0 లేదా 3-1 తేడాతో చేజిక్కించుకునే అవకాశం ఉందని గంభీర్‌ అన్నారు. అయితే పింక్‌ బాల్‌తో జరిగే టెస్ట్‌లో మాత్రం ఇరు జట్లకు సమానమైన అవకాశాలు ఉన్నయని ఆయన పేర్కొన్నారు. శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌కు ఈ సిరీస్‌ చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని గంభీర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..