ENG vs SL: మలాన్ మాయ.. మూడో టీ20లోనూ ఇంగ్లండ్ ఘన విజయం; సిరీస్‌ క్లీన్‌స్వీప్

|

Jun 27, 2021 | 7:10 AM

అగాస్ బౌల్‌లో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

ENG vs SL: మలాన్ మాయ.. మూడో టీ20లోనూ ఇంగ్లండ్ ఘన విజయం; సిరీస్‌ క్లీన్‌స్వీప్
Eng Vs Sl T20 Series
Follow us on

ENG vs SL: అగాస్ బౌల్‌లో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే కార్డిఫ్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు.. తాజాగా అగాస్‌లో మరో విజయంతో శ్రీలంకకు మొండిచేయి చూపించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 91 పరుగులకు చేతులెత్తేయడంతో ఇంగ్లీష్ జట్లు విజయం ఖాయమైంది.

ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్ డేవిడ్ మలాన్ 76 పరగుల(48 బంతులు, 5 ఫోర్లు, 4 సిక్సులు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే మరో ఓపెనర్ బెయిర్‌స్టో 51 పరుగుల(43 బంతులు, 5ఫోర్లు, సిక్స్)తో భారీ ఓపెనింగ్ అందించారు. కానీ, వీరిద్దిరు పెవిలియన్ చేరాక ఇంగ్లండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్స్టోన్ 14, బిల్లింగ్స్ 2, కెప్టెన్ మోర్గాన్ 1, మొయిన్ 7, సామ్ కుర్రాన్9*, క్రిస్ జోర్డాన్ 8* మాత్రమే చేశారు. 20 ఓవర్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక శ్రీలంక బౌలర్లలో చమీరా 4 వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఫెర్నాండో, ఉదానా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఏ దశలోనూ ఇంగ్లండ్ జట్టుకు పోటీని ఇవ్వలేకపోయింది. సామ్ కర్రన్ 2 వికెట్లు, డేవిడ్ విల్లే 3 వికెట్లతో చెలరేగడంతో శ్రీలంక కేవలం 18.5 ఓవర్లకు 91 పరుగులుకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఒషాడా ఫెర్నాండో 19, నిరోషాన్ డిక్‌వెల్లా 11 లు మాత్రమే రెండెంకల స్కోర్ చేయగలిగారు. మిగతా బ్యాట్స్‌మెన్లంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దీంతో ఇంగండ్ విజయం సునాయసమైంది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తేడాతో గెలిచింది. ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడిన సామ్ కర్రన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది. అలాగే ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన డేవిడ్ మలాన్‌ కి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ లభించింది.

మరోవైపు ఇంగ్లండ్ టీం త్వరలో భారత్‌ తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది. అలాగే శ్రీలంక జట్టు స్వదేశంలో టీమిండియా 2తో వన్డే, టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇప్పటికే టీమిండియా 2 ని సెలక్ట్ చేసిన బీసీసీఐ ప్రస్తుతం ఆటగాళ్లను ముంబై లో క్యారంటైన్‌ ఉంచింది. శ్రీలంక పర్యటనకు శిఖర్ ధవన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భువనేశ్వర్ వైస్ కెప్టెన్‌ కాగా, రాహుల్ ద్రవిడ్ హెచ్‌ కోచ్‌గా నియమితుడైయ్యాడు.

సంక్షిప్తంగా స్కోర్లు:
ఇంగ్లండ్ టీం: 180/6 (డేవిడ్ మలాన్ 76 పరగులు, బెయిర్‌స్టో 51 పరుగులు)(చమీరా 4 వికెట్లు)
శ్రీలంక: 91/10 (ఫెర్నాండో 20 పరుగులు, ఒషాడా ఫెర్నాండో 19)(సామ్ కర్రన్ 2 వికెట్లు, డేవిడ్ విల్లే 3 వికెట్లు)

Also Read:

Glenn Phillips : 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్..! 5 సిక్సర్లు, 7 ఫోర్లతో అదరగొట్టేశాడు ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్..

World Cup 1983: “ధోనీసేనపై విజయం మాదే.. ప్రపంచకప్‌ను అస్సలు వదులుకోం”: కపిల్‌ డెవిల్స్‌

Wimbledon 2021: జకోవిచ్, ఫెదరర్‌ ల పోరు మరోసారి..! వింబుల్డన్‌లో తలపడే అవకాశం

T20 World Cup: అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌; నవంబర్‌ 14న ఫైనల్