IND vs ENG 1st Test: సత్తా చాటిన భారత బౌలర్లు.. 246 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 37 పరుగులు, బెన్ డకెట్ 35 పరుగులు చేశారు.

IND vs ENG 1st Test: సత్తా చాటిన భారత బౌలర్లు.. 246 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్..
Ind Vs Eng 1st Test Score

Updated on: Jan 25, 2024 | 3:10 PM

IND vs ENG 1st Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 37 పరుగులు, బెన్ డకెట్ 35 పరుగులు చేశారు.

భారత్ తరపున రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64.3 ఓవర్లలోనే ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..