IND Vs ENG: విజృంభించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. కుప్పకూలిన కోహ్లీసేన.. 78 పరుగులకే ఆలౌట్..

India Vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కుప్పకూలింది. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి రెండో సెషన్‌లోనే కోహ్లీసేన చేతులెత్తేసింది..

IND Vs ENG: విజృంభించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. కుప్పకూలిన కోహ్లీసేన.. 78 పరుగులకే ఆలౌట్..
England

Updated on: Aug 25, 2021 | 7:53 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కుప్పకూలింది. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి రెండో సెషన్‌లోనే కోహ్లీసేన చేతులెత్తేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు పేలవ ప్రదర్శనను కనబరిచారు. ఒకరి తర్వాత ఒకరు వెనువెంటనే పెవిలియన్ చేరారు. మొదటి బంతి నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.

ముఖ్యంగా ఆండర్సన్ కీలక వికెట్లు పడగొట్టి.. టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్(0), పుజారా(1), విరాట్ కోహ్లీ(7)లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహనే(18), రోహిత్ శర్మ(19)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నా.. ఇంగ్లాండ్ పేసర్లు వారిని క్రీజులో కుదురుకోకుండా చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తప్పితే మరెవ్వరూ కూడా రెండంకెల స్కోర్ దాటలేకపోయారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్, ఓవర్టన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్, కర్రన్ రెండేసి వికెట్లు తీశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us