పనైపోయిందన్నారు.. పనికిరాడని పక్కనపెట్టేశారు.. కట్ చేస్తే.. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను మడతెట్టేశాడు

|

Nov 15, 2024 | 1:20 PM

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ సాకిబ్ మహమూద్ హీరోగా నిలిచాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా..

పనైపోయిందన్నారు.. పనికిరాడని పక్కనపెట్టేశారు.. కట్ చేస్తే.. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను మడతెట్టేశాడు
Eng Vs Wi
Follow us on

వెస్టిండీస్‌‌లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్ సెయింట్ లూసియా మైదానంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఆ టార్గెట్‌ను జోస్ బట్లర్ జట్టు 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ సాకిబ్ మహమూద్ హీరోగా నిలిచాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు ఈ సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

గాయం నుంచి తిరిగి..

ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ మహమూద్ అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. అతని పదునైన బౌలింగ్ ముందు వెస్టిండీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. పవర్‌ప్లేలో మొదటి 5 బ్యాట్స్‌మెన్లలో ముగ్గురిని సాకిబ్ అవుట్ చేశాడు. సాకిబ్ మహమూద్ తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి టీ20లో 4 వికెట్లు, రెండో టీ20లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లీష్‌ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. గాయం కారణంగా సాకిబ్ మహమూద్ గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పేస్‌కు పేరొందిన సాకిబ్ 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కానీ దీని తర్వాత అతను వరుస గాయాలతో.. కెరీర్ రెండేళ్లు నాశనమైంది. ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చిన వెంటనే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

వరుసగా మూడో విజయం..

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా గాయం కారణంగా చాలా నెలల తర్వాత ఈ సిరీస్ ద్వారా తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన అతను మూడో మ్యాచ్‌లో గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సాకిబ్ మహమూద్, మిగతా బౌలర్లు సాయంతో ప్రత్యర్ధి జట్టును తక్కువ పరుగులకే ఆలౌట్ చేశాడు. పవర్‌ప్లే సమయంలో సాకిబ్.. ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి తుఫాను బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ చేర్చాడు. దీని కారణంగా వెస్టిండీస్ జట్టులో సగం మంది ప్లేయర్స్ తొలి 6 ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. దీంతో ఆ జట్టు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దానిని ఛేదించేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు కూడా పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. అయితే, విల్ జాక్వెస్ 32 పరుగులతో, సామ్ కర్రాన్ 41 పరుగులతో జట్టును విజయం వైపు నడిపించారు. లియామ్ లివింగ్‌స్టన్ 28 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్లో 4 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..