Telugu News Sports News Cricket news ENG vs SA Internet reacts to Tristan Stubbs making headlines for Proteas with unbelievable knock Telugu Cricket News
28 బంతుల్లో 72 రన్స్.. 8 సిక్స్‌లతో 257కు పైగా స్ట్రైక్ రేట్.. బౌలర్లకు చుక్కలు చూపించిన ముంబై ప్లేయర్
ENG vs SA: బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే సఫారీలు ఓడిపోయినా ఆ జట్టు యంగ్ ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs) మాత్రం కొద్దిసేపు బ్రిటిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ENG vs SA: బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే సఫారీలు ఓడిపోయినా ఆ జట్టు యంగ్ ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs) మాత్రం కొద్దిసేపు బ్రిటిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21 ఏళ్ల స్టబ్స్ కేవలం 28 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 235 పరుగుల లక్ష్య ఛేదనలో అతను ఏకంగా 257కు పైగా స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేయడం విశేషం. ఈ తుపాన్ ఇన్నింగ్స్ ద్వారా దక్షిణాఫ్రికా తరఫున ఇంగ్లండ్ హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా స్టబ్స్ రికార్డు సృష్టించాడు.
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు చేసింది. బెయిర్‌స్టో (90), మొయిన్ అలీ (52) చెలరేగారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సఫారీలు 86 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. సరిగ్గా ఇక్కడే స్టబ్స్ తుపాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. వచ్చిరావడంతోనే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ధాటికి ఒకానొకదశలో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పదేమో అనిపించింది. అయితే గ్లెసిన్ బౌలింగ్‌లో అతను పెవిలియన్‌కు చేరుకోవడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. కాగా ఈ యంగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మధ్యలో గాయపడిన టైమల్ మిల్స్ స్థానంలో స్టబ్స్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే అవకాశాలు మాత్రం రాలేదు. ఈక్రమంలో వచ్చే ఏడాది సీజన్‌లో స్టబ్స్ చెలరేగుతాడని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.