Video: ఫ్లాట్ పిచ్‌పై సిక్సర్‌తో చెలరేగిన డీఎస్పీ సిరాజ్.. కట్‌చేస్తే.. 58 ఏళ్ల నిరీక్షణకు తెర పడేనా?

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. భారత జట్టు 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు కేఎల్ రాహుల్ 28 పరుగులతో, కరుణ్ నాయర్ 7 పరుగులతో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తారు. యశస్వి జైస్వాల్ 28 పరుగులు చేసిన తర్వాత జోష్ టాంగ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా ఔటయ్యాడు.

Video: ఫ్లాట్ పిచ్‌పై సిక్సర్‌తో చెలరేగిన డీఎస్పీ సిరాజ్.. కట్‌చేస్తే.. 58 ఏళ్ల నిరీక్షణకు తెర పడేనా?
Mohammed Siraj

Updated on: Jul 05, 2025 | 6:55 AM

England vs India, 2nd Test: బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో మూడో రోజు కూడా భారత్ తన ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే పరిమితం చేసింది. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 1 వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. మొత్తంగా భారత ఆధిక్యం 244 పరుగులకు పెరిగింది.

అంతకుముందు మూడో రోజు ఇంగ్లాండ్ కేవలం 88 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి జేమీ స్మిత్ 184 పరుగులు చేయగా, హ్యారీ బ్రూక్ 158 పరుగులతో భారత బౌలర్లకు ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధించారు. వీరిద్దరూ జట్టు తరపున 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు, ఆకాశ్‌దీప్ 4 వికెట్లు పడగొట్టారు.

మూడో రోజు ఇంగ్లాండ్ 77/3లతో ఆటను ప్రారంభించింది. మొహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో జో రూట్, బెన్ స్టోక్స్‌లను పెవిలియన్‌కు పంపాడు. రూట్ 22 పరుగులు చేశాడు. స్టోక్స్ ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత బ్రూక్, స్మిత్ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రూక్ 158 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. స్మిత్ 184 పరుగులు చేసిన తర్వాత నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 407 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. భారత జట్టు 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు కేఎల్ రాహుల్ 28 పరుగులతో, కరుణ్ నాయర్ 7 పరుగులతో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తారు. యశస్వి జైస్వాల్ 28 పరుగులు చేసిన తర్వాత జోష్ టాంగ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా ఔటయ్యాడు.

ఇరుజట్ల ప్లేయింగ్-11:

ఇంగ్లాండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్యూ, షోయబ్ బషీర్.

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..