పంత్ మెరుపులు.. ఢిల్లీ సూపర్ విక్టరీ

ఐపీఎల్ 12వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. రేస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పేలవమైన ఆటతో చేతులెత్తేసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌  చిత్తుగా ఓటమి పాలై ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. రాయల్స్ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కి తొమ్మిదో విజయం కాగా, రాజస్థాన్ ఎనిమిదో ఓటమి. రిషబ్ పంత్‌ […]

పంత్ మెరుపులు.. ఢిల్లీ సూపర్ విక్టరీ
Follow us

| Edited By: Srinu

Updated on: May 04, 2019 | 8:09 PM

ఐపీఎల్ 12వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. రేస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పేలవమైన ఆటతో చేతులెత్తేసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌  చిత్తుగా ఓటమి పాలై ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. రాయల్స్ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కి తొమ్మిదో విజయం కాగా, రాజస్థాన్ ఎనిమిదో ఓటమి. రిషబ్ పంత్‌ (53 నాటౌట్‌; 38 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.