ఇది గమనించారా.. భారత్ ఓటమికి గంభీర్ పంపిన ఆ ‘మెసేజ్’ కారణమా? కోహ్లీ-హర్షిత్ జోరుకు బ్రేకులువేసిన ఆ మ్యాటరేంటి?

Gautam Gambhir Message: గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్ చేతిలో భారత్ ఎదుర్కొన్న రెండో సిరీస్ ఓటమి ఇది. గంభీర్ పంపిన సందేశం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసిందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా, కివీస్ జట్టు తమ పట్టుదలతో భారత్ కోటలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

ఇది గమనించారా.. భారత్ ఓటమికి గంభీర్ పంపిన ఆ ‘మెసేజ్’ కారణమా? కోహ్లీ-హర్షిత్ జోరుకు బ్రేకులువేసిన ఆ మ్యాటరేంటి?
Harshit Rana Virat Kohli

Updated on: Jan 19, 2026 | 11:48 AM

Gautam Gambhir Message: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన మూడవ వన్డేలో ఒక ఆసక్తికర సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు హర్షిత్ రాణా జోడిని విడదీయడంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పంపిన ఒక సందేశం ప్రభావం చూపిందా? గెలిచే మ్యాచ్‌లో భారత్ ఎక్కడ తడబడింది? పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..?

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడవ వన్డేలో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని, భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకపోయినా, మైఖేల్ బ్రేస్‌వెల్ సారథ్యంలో కివీస్ అద్భుత ప్రదర్శన చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా ఓటమికి అతిపెద్ద విలన్ ఇతడే.. కట్‌చేస్తే.. వన్డేల నుంచి రిటైర్మెంట్?

గెలుపు ముంగిట్లో ట్విస్ట్ ఇచ్చిన గంభీర్: న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడినప్పటికీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (124) అద్భుత సెంచరీతో పోరాడాడు. అతనికి తోడుగా యువ బౌలర్ హర్షిత్ రాణా బ్యాట్‌తోనూ మెరిశాడు. వీరిద్దరి మధ్య 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొంది. భారత్ విజయం సాధించాలంటే చివరి 7 ఓవర్లలో 68 పరుగులు కావాలి. చేతిలో వికెట్లు తక్కువగా ఉన్నా, కోహ్లీ క్రీజులో ఉండటం, హర్షిత్ రాణా సిక్సర్లతో విరుచుకుపడటంతో భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు.

గౌతమ్ గంభీర్ సందేశం.. మారిపోయిన సమీకరణం: మ్యాచ్ 42వ ఓవర్ ముగిసిన తర్వాత ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ధ్రువ్ జురెల్ ద్వారా మైదానంలో ఉన్న ఆటగాళ్లకు ఒక సందేశాన్ని పంపారు. ఆ మెసేజ్ ఏంటనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ తర్వాతే మ్యాచ్ మలుపు తిరిగింది. అంతవరకు ఎటాకింగ్ గేమ్‌ ఆడిన హర్షిత్ రాణా, తన కెరీర్‌లో మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: Viral Video: చాలు, చాల్లే.. బయటకు పో ఇక.. టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ

ఒంటరి పోరాటం చేసిన కింగ్ కోహ్లీ: హర్షిత్ రాణా అవుట్ అయిన మరుసటి బంతికే మహమ్మద్ సిరాజ్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ తన పోరాటాన్ని ఆపలేదు. 108 బంతుల్లో 124 పరుగులు చేసిన విరాట్, చివరికి ఒక తప్పుడు షాట్ ఆడి క్యాచ్ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా భారత్ 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..