Video: ఇది రా ధోని అంటే..! ఊరికే గొప్పోళ్లు అయిపోరు బాస్‌.. ఏం జరిగిందో తెలిస్తే ఫిదా అవుతారు

చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ పై విజయం సాధించిన తర్వాత, ధోని ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ తర్వాత అన్ని జట్టు ఆటగాళ్లతో చేతులు కలపడంలో ఒక యువ ఆటగాడిని మర్చిపోయిన ధోని, అతని వద్దకు వెళ్లి చేతులు కలిపాడు. ఈ సంఘటన గురించి మరింత తెలుసుకుందాం..

Video: ఇది రా ధోని అంటే..! ఊరికే గొప్పోళ్లు అయిపోరు బాస్‌.. ఏం జరిగిందో తెలిస్తే ఫిదా అవుతారు
Ms Dhoni

Updated on: May 08, 2025 | 1:30 PM

వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు చెన్నై సూపర్‌ కింగ్స్ విజయం సాధించింది. బుధవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలవడం వల్ల సీఎస్‌కేకు వచ్చిన లాభమేమి లేకపోయినా.. కేకేఆర్‌కు మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగించింది. కంఫర్ట్‌బుల్‌గా ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఉన్న కేకేఆర్‌ను సీఎస్‌కే చావుదెబ్బ కొట్టింది. ఇప్పటికీ టెక్నికల్‌గా కేకేఆర్‌కు ప్లే ఆఫ్‌ ఛాన్సులు ఉన్నప్పటికీ అది అంతా ఈజీ కాదు. మ్యాచ్‌ సంగతి కాసేపు పక్కనపెడితే.. సీఎస్‌కే వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌ తర్వాత జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి మాట్లాడుకోవాలి. ఆ సంఘటన ధోని గొప్పతనం గురించి తెలియజేస్తుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకుంటారనే విషయం తెలిసిందే. జెంటిల్‌మెన్‌ గేమ్‌ అయిన క్రికెట్‌లో ఇది సర్వసాధారణమైన విషయం. అయితే మ్యాచ్‌ గెలిచిన తర్వాత కేకేఆర్‌ ప్లేయర్లందరితో హ్యాండ్‌ షేక్‌ చేసిన ధోని.. ఓ యంగ్‌ ప్లేయర్‌ను పొరపాటున మర్చిపోయాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా.. ఆ విషయం ధోనికి గుర్తొచ్చింది. ఒక ప్లేయర్‌ మిస్‌ అయ్యాడే అంటూ వెనక్కి తిరిగి చూశాడు.. అక్కడ చేతన్‌ సకారియా ఉన్నాడు. అతనో యంగ్‌ బౌలర్‌. అతనికి ధోని షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తూ ఆగి అతని వద్దకు వెళ్లి ధోని షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.

దిగ్గజ ప్లేయర్‌ పొరపాటున మర్చిపోయినా పెద్ద విషయం కాదు. కానీ, గుర్తొంచుకొని, ఓ యంగ్‌ ప్లేయర్‌ వద్దకు వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి అతన్ని అప్రిషియేట్‌ చేయడం గొప్ప విషయం. అందుకే ధోని ఇంత గొప్ప ప్లేయర్‌ అయ్యాడు.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ధోని గొప్పే అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. గతంలో ఓ సారి ధోని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు త్వరగా హ్యాండ్‌ షేక్‌ రావడంలో లేదని గ్రౌండ్‌లో నుంచి వెళ్లిపోయాడంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఘటన ధోని అంటే ఏంటో మరోసారి నిరూపించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..