Dhoni: నా కెరీర్‌లో అవే అత్యంత బాధాకర క్షణాలు.. ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Aug 01, 2024 | 8:52 PM

క్రికెట్‌ అభిమానులకు 2019 వన్డే ప్రపంచ కప్‌ సెమీస్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్‌ చేతిలో తృటిలో ఓటమిని చవిచూసి నిష్క్రమించింది. ఎంఎస్ ధోనీ కీలక సమయంలో రనౌట్‌ కావడంతో టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు.

Dhoni: నా కెరీర్‌లో అవే అత్యంత బాధాకర క్షణాలు.. ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..
MS Dhoni
Follow us on

క్రికెట్‌ అభిమానులకు 2019 వన్డే ప్రపంచ కప్‌ సెమీస్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్‌ చేతిలో తృటిలో ఓటమిని చవిచూసి నిష్క్రమించింది. ఎంఎస్ ధోనీ కీలక సమయంలో రనౌట్‌ కావడంతో టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. అంతేకాదు, క్రికెట్ అభిమానులను బాధపెట్టిన మరో అంశం.. ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా అదే. కొద్దిరోజులకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు మహీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి మ్యాచ్‌ విశేషాలు గుర్తుచేసుకున్నాడు. 2019 ప్రపంచ కప్ ఓటమి నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టిందని తెలిపారు.

తనకు అదే చివరి వరల్డ్‌ కప్‌ అని తెలుసన్న ధోనీ ఆ మ్యాచ్‌లో విజయం సాధించిఉంటే చాలా బాగుండేదన్నారు.. తనను అత్యంత బాధపెట్టిన క్షణం అదేనని.. అయితే ఫలితం ఎలా వచ్చినా దాన్ని మనం సానుకూలంగానే తీసుకొని..ముందుకు సాగిపోవాలని వ్యాఖ్యానించారు. వరల్డ్‌ కప్ ముగిసిన తర్వాత ఆ ఓటమిని జీర్ణించుకునేందుకు కాస్త సమయం పట్టిందని…తన మనసును అత్యంత బాధపెట్టిన క్షణం మాత్రం అదేనని ధోనీ అన్నారు..

ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో నాకు ఇష్టమైన ప్లేయర్ల గురించి చెప్పడం కష్టమే. మరీ ముఖ్యంగా బ్యాటర్ల విషయంలో చెప్పలేను. చాలామంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఎవరని అడుగుతుంటారు. వీరేకాకుండా మరికొందరు అద్భుత బ్యాటర్లు ఉన్నారు. అలాగని అత్యుత్తమ బౌలర్లు లేరని కాదు. బ్యాటర్ల విషయం పక్కనపెడితే.. బౌలింగ్‌లో మాత్రం మరో ఛాన్స్‌ లేదు. అది బుమ్రానే అని ధోనీ వెల్లడించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనే అభిమానులను అలరిస్తున్న ధోనీ.. వచ్చే ఏడాది సీజన్‌లో ఆడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ ఇటీవల ముగిసిన సీజన్‌ సమయంలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసారు.