Devdutt Padikkal : కన్నడ క్రికెటర్‎కు జాక్‌పాట్.. మహారాజా ట్రోఫీలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడు

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఆడిన దేవ్ దత్ పడిక్కల్, మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో జాక్‌పాట్ కొట్టారు. హుబ్లీ టైగర్స్ జట్టు అతడిని రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది మహారాజా ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక ధర. దీంతో పడిక్కల్ చరిత్ర సృష్టించాడు.

Devdutt Padikkal : కన్నడ క్రికెటర్‎కు జాక్‌పాట్.. మహారాజా ట్రోఫీలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడు
Devdutt Padikkal

Updated on: Jul 16, 2025 | 12:15 PM

Devdutt Padikkal : ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి మంచి ప్రదర్శన కనబరిచిన కర్ణాటక ఆటగాడు దేవ్ దత్ పడిక్కల్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న దేవ్ దత్ పడిక్కల్, ఇప్పుడు మహారాజా ట్రోఫీ టీ20 కోసం రెడీ అయ్యాడు. యువ ఆటగాళ్లపై జట్లు భారీగా పెట్టుబడి పెడుతున్న ఈ టోర్నీలో పడిక్కల్‌కు జాక్‌పాట్ తగిలింది. ఈసారి జరిగిన వేలంలో అతడు హిస్టరీ క్రియేట్ చేశారు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన దేవ్ దత్ పడిక్కల్‌ను ఈ ఏడాది ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అక్కడ పడిక్కల్ తన సత్తా చాటడంతో, అది మహారాజా ట్రోఫీ వేలంలో అతడికి బాగా కలిసొచ్చింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 15న జరిగిన మహారాజా ట్రోఫీ వేలంలో పడిక్కల్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అతడిని రూ.3.20 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు హుబ్లీ టైగర్స్ జట్టు పడిక్కల్‌ను ఏకంగా రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది మహారాజా ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక ధర.

పడిక్కల్ తర్వాత మరో కన్నడిగ ప్లేయర్ మనీష్ పాండేను మైసూర్ వారియర్స్ జట్టు రూ.12.20 లక్షలకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన అభినవ్ మనోహర్ను హుబ్లీ టైగర్స్ జట్టు రూ.12.20 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ను మంగళూరు డ్రాగన్స్ జట్టు రూ.8.60 లక్షలకు కొనుగోలు చేసింది.

మహారాజా ట్రోఫీలో స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. ప్రతి ఫ్రాంచైజీ జట్టులో తప్పనిసరిగా ఇద్దరు స్థానిక ఆటగాళ్లు ఉండాలి. ఇది స్థానిక క్రికెటర్లకు ఒక మంచి అవకాశం. అయితే, ఈ టోర్నీలో మ్యాచ్‌లను క్లోజ్డ్ స్టేడియంలలో నిర్వహిస్తారు. అంటే, ప్రేక్షకులకు మ్యాచ్‌లను మైదానంలో చూసే అవకాశం ఉండదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..