
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత కాస్త వెనకబడింది. దీంతో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలు నాలుగు ఓటములతో పాయింట్ల పట్టకలో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఢిల్లీ ప్లేఆప్స్‌కు చేరుకోవాలంటే తమ ఆటతీరును ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేసింది. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక జరగబోయే మూడు లీగ్ మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా దించనున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్‌లో అనుకున్న మేర పరుగులు రాకపోవడంతో.. బ్యాటింగ్ లైనప్‌లో మార్పులను చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌లలో రాహుల్ ఒక్కసారి మాత్రమే ఓపెనర్‌గా వచ్చాడు. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కొన్ని సార్లు నెంబర్ 3, కొన్ని సార్లు నంబర్ 4 లో బ్యాటింగ్ చేశాడు.
ఇక పాయింట్ల పట్టకలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ ప్లే ఆప్స్‌కు చేరాలంటే బ్యాటింగ్ లైనప్ మెరుగ్గా ఉండాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. కేఎల్ రాహుల్ పవర్ ప్లేలో చక్కగా రాణించగలడని..పవర్‌ప్లే అవకాశాలను తాను వినియోగించుకుంటాడని ఢిల్లీ ఓనర్స్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే అతని ఓపెనర్‌గా తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే సీజన్ మొదట్లో మంచి ఫర్ఫామెన్స్ ఇచ్చిన జట్టు తర్వాత కొన్ని మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శనలతో నిరాశపర్చింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరే సమయంలో జట్టు ప్రదర్శన ఇలా ఉంటే చాలా అను లక్ష్యాన్ని చేరలేమని.. జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై మరింత శ్రద్ధ పెట్టాలని ఢిల్లీ భావిస్తోంది.
అయితే అటు బ్యాటింగ్ పరావాలేదనిపించుకున్నప్పటికి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్స్ చేతులెస్తేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే జట్టు బౌలింగ్ మెరుగుపడాల్సి ఉండగా ఇప్పుడు జట్టుకు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మెయిన్ బోలర్ పేసర్ మిచెల్ స్టార్క్ తర్వాతి మ్యాచ్‌లకు దూరం అయినట్టు తెలుస్తోంది. భారత్ -పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో విదేశీ ప్లేయర్స్ తమ దేశాలకు వెళ్లి పోయారు. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లిపోయిన మిచెల్ స్టార్క్ తిరిగి భారత్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..