WPL 2026: వరుసగా 4వసారి ఫైనల్‌లోకి ఢిల్లీ.. తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి రెడీ..?

DC W vs GG W WPL 2026 Eliminator: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్ నుంచి నిలకడగా రాణిస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగు సీజన్లలో ఫైనల్స్‌కు చేరుకుంది. గత మూడు ఫైనల్స్‌లో ఓడిపోయిన ఢిల్లీ టీం.. కొత్త కెప్టెన్ జెమిమా రోడ్రిగ్జ్ సారథ్యంలో ఆర్సీబీని ఢీ కొట్టేందుకు సిద్ధమైంది.

WPL 2026: వరుసగా 4వసారి ఫైనల్‌లోకి ఢిల్లీ.. తొలి ట్రోఫీ కోసం మాజీ ఛాంపియన్‌తో పోటీకి రెడీ..?
Wpl 2026 Final
Image Credit source: https://x.com/wplt20

Updated on: Feb 04, 2026 | 7:42 AM

DC W vs GG W WPL 2026 Eliminator: ఎట్టకేలకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తుది పోరుకు సిద్ధమైంది. ఫైనల్ మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెడీ అయింది. డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే నిలకడగా రాణిస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాల్గవ సీజన్‌లోనూ ఫైనల్ చేరింది. కొత్త సారథి జెమిమా రోడ్రిగ్జ్ సారథ్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. గత 3 ఫైనల్స్‌లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారైనా ఫైనల్ పోరులో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

వడోదరలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ బెత్ మూనీ (62 నాటౌట్) కీలక పాత్ర పోషించింది. అయితే, 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మూనీ జట్టును పోరాడే స్కోర్ వరకు చేర్చింది. మరో బ్యాటర్ జార్జియా వేర్‌హామ్ 35 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ తరపున షెనెల్లె హెన్రీ 3 వికెట్లు పడగొట్టగా, భారత యువ బౌలర్ నందిని శర్మ 2 వికెట్లు పడగొట్టింది.

ఢిల్లీ ఓపెనర్ల దూకుడు..

ఢిల్లీ ఓపెనింగ్ జోడి మరోసారి దూకుడుగా కనిపించారు. లిజెల్ లీ, షఫాలీ వర్మ కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత వీరిద్దరు పెవిలియన్ చేరడంతో కెప్టెన్ జెమీమా, స్టార్ బ్యాట్స్‌మెన్ లారా వోల్వార్డ్ట్ మరో 68 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. 16వ ఓవర్‌లో వోల్వార్డ్ట్ బౌండరీ కొట్టి ఢిల్లీని ఫైనల్‌కు తీసుకెళ్లింది.

ఫైనల్‌ పోరులో RCB vs DC..

ఫిబ్రవరి 5వ తేదీ గురువారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. ఆర్సీబీ తన రెండవ టైటిల్‌ను అందుకోవాలని కోరుకుంటోంది. గురువారం జరిగే ఫైనల్ రెండేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌ను తలపించనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఢిల్లీ, బెంగళూరు ఫైనల్‌లో తలపడ్డాయి. అక్కడ ఆర్సీబీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుని, తొలి టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఢిల్లీకి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us