AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నాడు లైవ్ మ్యాచ్‌లో ఘోర అవమానం.. నేడు ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా

Sanjiv Goenka vs KL Rahul: లక్నో నుంచి విడుదలైన తర్వాత కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో సంజీవ్ గోయెంకాకు గట్టిగా ఇచ్చిపడేశాడు.

Video: నాడు లైవ్ మ్యాచ్‌లో ఘోర అవమానం.. నేడు ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
Sanjiv Goenka Vs Kl Rahul
Venkata Chari
|

Updated on: Apr 22, 2025 | 12:35 PM

Share

KL Rahul: ఐపీఎల్ 2025లో భాగంగా 44వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో, మాజీ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ లక్నో జట్టులో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య ప్రతీకార జ్వాలలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మ్యాచ్‌కు ముందు, కేఎల్ రాహుల్ ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. దీంతో సంజీవ్ గోయెంకాకు గట్టిగానే ఇచ్చిపడేశాడు.

ఎట్టకేలకు మౌనం వీడిన కేఎల్ రాహుల్..

ఐపీఎల్ గత సీజన్ కేఎల్ రాహుల్‌ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అతను లక్నోలో భాగంగా ఉన్నాడు. చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని అతనిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

లైవ్ మ్యాచ్ సమయంలో, సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తరువాత కేఎల్ రాహుల్ చాలా ఉద్రిక్తంగా కనిపించాడు. కానీ, అతను 18వ సీజన్‌కు ముందే విడుదలయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని మెగా వేలంలో కొనుగోలు చేసింది. ఆ తరువాత ఈ విషయంపై ఎప్పుడు మాట్లాడలేదు. తాజాగో ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

“ఐపీఎల్ 2024 రిటెన్షన్ తర్వాత నేను మళ్ళీ ఆడాలని అనుకున్నాను, సీఎస్కే, గుజరాత్ వంటి జట్లు పోటీ పడ్డాయి. అలా జరిగి ఉంటే, ఆటగాడిగా నాకు మంచి అవకాశంగా ఉండేది. ఢిల్లీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చాలా ఒత్తిడి ఉంది. ఇప్పటికే దానిని ఎదుర్కొన్నాం. నేను అలసిపోయానంటూ, పరుగులు చేయలేనంటూ విమర్శలు గుప్పించారు. కానీ, కాలమే అన్నింటికి సమాధానం ఇస్తుంది. చివరికి నాకే మంచి జరిగింది.” అంటూ చెప్పుకొచ్చాడు.

సంజీవ్ గోయెంకా తన తప్పును గ్రహించేలా కేఎల్ రాహుల్ కౌంటర్..

సంజీవ్ గోయెంకా విషయానికొస్తే, అతను లక్నో సూపర్ జెయింట్స్ యజమాని. కేఎల్ రాహుల్ చివరి ఐపీఎల్ సీజన్ ఎంతో ఉద్రిక్తతతో కనిపించింది. ఆ సమయంలో ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిలో సంజీవ్ గోయెంకా లైవ్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ను మందలిస్తున్నాడు. దీనిని భారత మాజీ ఆటగాళ్ళు కూడా విమర్శించారు. అతను వీధి క్రికెటర్ కాదు, అతనితో ఇలా వ్యవహరించకూడదంటూ సూచించారు.

ఇది కూడా చదవండి: Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

కానీ, ఆ సమయంలో లోకేష్ రాహుల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. రూ.28,390 కోట్ల ఎల్‌ఎస్‌జీ యజమానికి తన తప్పును తెలుసుకునేలా చేస్తున్నాడు. లక్నో రిషబ్ పంత్‌ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ, పంత్ ధరలో సగం ఉన్న కేఎల్ రాహుల్ ఆడటం చూసినప్పుడల్లా, సంజీవ్ గోయంకా బాధపడుతున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సంజీవ్ గోయెంకాకు కేఎల్ రాహుల్ నుంచి ఇంతకంటే మంచి సమాధానం ఇంకేం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రూ. 27 కోట్ల పంత్ జీరో.. కేఎల్ రాహుల్ హీరో..

ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. అతను 8 మ్యాచ్‌ల్లో 15 సగటుతో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కేఎల్ రాహుల్ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. అతను 6 మ్యాచ్‌ల్లో 53.20 సగటుతో 266 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్ నుంచి 2 హాఫ్ సెంచరీలు కూడా కనిపించాయి. ఈ కాలంలో, కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ 158గా ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..