David Warner: డేవిడ్ వార్నర్ తన ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. కానీ, భారతదేశంలో టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే, ఈ ప్లేయర్ ఫాంలేమితో తంటాలు పడుతున్నాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కూడా వార్నర్‌కు పెద్ద సవాల్‌గా మారింది. భారత నాణ్యమైన బౌలింగ్ లైనప్‌ను ఛేదించేందుకు ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్నాడు. నాగ్‌పూర్ పిచ్ కూడా ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌లకు కష్టంగా ఉందని భావిస్తున్న వేళ.. డేవిడ్ వార్నర్ భిన్నమైన మార్గాన్ని కనుగొన్నాడు. మాములుగా అయితే, వార్నర్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అని అందరికీ తెలిసిందే. కానీ, నెట్స్‌లో మాత్రం కుడి చేతితో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో తొలి టెస్టులో భిన్నమైన శైలిలో కనిపిస్తాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నాడు. అందులో అతను కుడి చేతితో బ్యాటింగ్ చేస్తున్నట్లు చూడొచ్చు. గతంలో వార్నర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో కూడా తన కుడి చేతితో బ్యాటింగ్ చేశాడు.
Extraordinary skill – @davidwarner31 switching between batting left and right handed in the nets at Alur #INDvAUS pic.twitter.com/6cHhJAcvSm
— Louis Cameron (@LouisDBCameron) February 5, 2023
డేవిడ్ వార్నర్ కుడి చేతితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఇప్పుడు అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న ఈ ఆటగాడు నాగ్‌పూర్‌లో కుడి చేతితో బ్యాటింగ్ చేయగలడా? అని ఆలోచిస్తున్నారు. ఇందుకు మాత్రం చాలా తక్కువ అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు నాగ్‌పూర్ పిచ్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. నిజానికి నాగ్‌పూర్ పిచ్‌లో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్ అంత సులభం కాదు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కోసం ప్రత్యేక కఠినమైన ప్రాంతం ఉంది. ఇక్కడ బంతిని ఆడడం అంత సులభం కాదు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ XIలో కనీసం ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు. ఇది ఈ జట్టుకు ఆందోళన కలిగించింది. వార్నర్ గురించి మాట్లాడితే, ఈ ఆటగాడు కుడి చేతితో కూడా బ్యాటింగ్ చేయగలడు. జూనియర్ క్రికెట్ రోజుల్లో, వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా పూర్తి సీజన్ ఆడాడు.
డేవిడ్ వార్నర్ భారతదేశంలో 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఆటగాడి బ్యాటింగ్ సగటు 24.25 మాత్రమే. వార్నర్ కేవలం 3 అర్ధ సెంచరీల సహాయంతో భారత్‌లో 388 పరుగులు చేయగలిగాడు. భారత్‌పై వార్నర్ టెస్టు యావరేజ్ దారుణంగా ఉంది. ఈ ఆటగాడు భారత్‌పై 18 టెస్టుల్లో కేవలం 33.76 సగటుతో 1148 పరుగులు చేయగలిగాడు. చివరి భారత పర్యటనలోనూ వార్నర్ 24.12 సగటుతో 193 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెస్టు సిరీస్‌లో వార్నర్ ప్రయోగాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..