David Warner: రాబిన్‌హుడ్‌ నుంచి డేవిడ్‌ వార్నర్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌! బౌండరీ టూ బాక్సాఫీస్‌ అంటూ..

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్, నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో నటించాడు. ఈ నెల 28న విడుదల కానున్న ఈ సినిమాలో వార్నర్ లుక్ విడుదలైంది. వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఉన్న అనుబంధం, తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా ప్రమోషన్స్ లోనూ వార్నర్ పాల్గొంటాడు.

David Warner: రాబిన్‌హుడ్‌ నుంచి డేవిడ్‌ వార్నర్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌! బౌండరీ టూ బాక్సాఫీస్‌ అంటూ..
David Warner

Updated on: Mar 15, 2025 | 4:47 PM

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. నితిన్‌ హీరోగా రూపొందిన రాబిన్‌ హుడ్‌ సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ గతంలోనే ప్రకటించింది. నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన ఈ రాబిన్‌ హుడ్‌ సినిమా ఈ నెల 28న రిలీజ్‌ కానుంది. అయితే తాజాగా యూవీలో డేవిడ్‌ వార్నర్ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫ్రమ్‌ బౌండరీ టూ బాక్సాఫీస్‌ అంటూ మూవీ యూనిట్‌ వార్నర్‌కు టాలీవుడ్‌లోకి స్వాగతం పలికారు. అలాగే సినిమా ప్రమోషన్స్‌లో కూడా వార్నర్‌ పాల్గొంటారని దర్శకుడు వెంకీ కుడుముల వెల్లడించారు.

దీంతో సినిమాపై సినీ అభిమానులతో పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మిగిలిన క్రికెటర్లంతా ఐపీఎల్‌లో హడావుడి చేస్తుంటే.. వార్నర్‌ మాత్రం థియేటర్లలో సందడి చేయనున్నాడు. కాగా గతంలో వార్నర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. అతన్ని అంతా డేవిడ్‌ భాయ్‌ అని ముద్దుగా పిలుచుకునేవారు. వార్నర్‌ కెప్టెన్సీలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ కప్పు గెలిచింది. ఆ తర్వాత వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి వెళ్లిపోయినా.. తెలుగు పాటలకు డ్యాన్స్‌ వేస్తూ రీల్స్‌ చేస్తూ తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా సినిమాతోనే పలకరించబోతున్నాడు.