Ashes Series: 48 గంటల తర్వాత కెరీర్‌లో చివరి టెస్టు ఆడనున్న స్మిత్, వార్నర్.. అదే మ్యాచ్‌లో రిటైర్మెంట్ ప్రకటన: మాజీ ప్లేయర్..

Ashes Series: నాలుగో టెస్టు మ్యాచ్ డ్రా కావడంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ను తన పేరులోనే ఉంచుకుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్ల గురించి కీలక ప్రకటన చేశాడు.

Ashes Series: 48 గంటల తర్వాత కెరీర్‌లో చివరి టెస్టు ఆడనున్న స్మిత్, వార్నర్.. అదే మ్యాచ్‌లో రిటైర్మెంట్ ప్రకటన:  మాజీ ప్లేయర్..
David Warner And Steve Smit

Updated on: Jul 25, 2023 | 8:21 PM

ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో చాలా ఉత్కంఠభరితమైన క్రికెట్ కనిపిస్తోంది. యాషెస్‌ను తమ వద్దే ఉంచుకోవడంలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ సమం చేసే అవకాశం ఉంది. అయితే సిరీస్ ముగిసేలోపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియా గురించి కీలక విషయం ప్రకటించాడు. ఈ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చివరి టెస్ట్ మ్యాచ్ అని ప్రకటించాడు.

యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జులై 27 నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది. వాన్ ప్రకారం, ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ల చివరి టెస్ట్ మ్యాచ్. వాన్ ప్రకారం, ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారంట.

వాన్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఓవల్‌లో ఆడగలడని వార్తలు వస్తున్నాయని.. ఈ విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని అన్నాడు. స్టీవ్ స్మిత్ చివరిసారిగా ఓవల్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడగలడనే విషయాలను కూడా తాను విన్నానని చెప్పుకొచ్చాడు. తాను ఈ విషయాలను మాత్రమే విన్నానని, వాటి వాస్తవికత గురించి తనకు తెలియదని తెలిపాడు.

యాషెస్ సమయంలోనే వార్నర్ తన కెరీర్ గురించి కీలక విషయం చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌ తనకు చివరి టెస్టు అని చెప్పుకొచ్చాడ. అయితే, స్మిత్ తన రిటైర్మెంట్ గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. అతను ప్రస్తుత కాలంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. అతను అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడ్డాడు. యాషెస్ సిరీస్‌లోనూ అతని బ్యాట్ మెరిసింది. గత నెలలో భారత్‌తో జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అతను సెంచరీ సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..