CSK vs RR: చెన్నై కోటను బద్దలు కొట్టేందుకు రాజస్థాన్ ఐదు సింహాలు రెడీ.. ధోనీ సేనకు డేంజర్ బెల్స్

CSK vs RR: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నైని ఓడించగల ఐదుగురు కీలక ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. ఈసారి రాజస్థాన్ జట్టులో ఉన్న ఈ ఐదుగురు మాత్రం చెన్నై విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నారు.

CSK vs RR: చెన్నై కోటను బద్దలు కొట్టేందుకు రాజస్థాన్ ఐదు సింహాలు రెడీ.. ధోనీ సేనకు డేంజర్ బెల్స్
Vaibhav Suryavanshi

Updated on: Mar 30, 2026 | 11:03 AM

CSK vs RR: ఐపీఎల్ 2026 సీజన్ మూడో మ్యాచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు గువహటిలోని బర్సాపరా స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చెన్నై జట్టు ఎప్పుడూ పటిష్టంగానే ఉన్నా, ఈసారి రాజస్థాన్ జట్టులో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు మాత్రం చెన్నై విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నారు. తమ అద్భుతమైన ఫామ్, పాత రికార్డులతో చెన్నై బౌలర్లకు, బ్యాటర్లకు వీరు చుక్కలు చూపించడం ఖాయం.

వైభవ్ సూర్యవంశీ పరుగుల ప్రభంజనం

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లకు మెయిన్ విలన్ కానున్నాడు. కేవలం పవర్ ప్లేలోని ఆరు ఓవర్లు ఇతడు క్రీజులో ఉంటే చాలు, స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. గత సీజన్‌లో 206 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడ్డ వైభవ్, ఇప్పుడు మరింత రాటుదేలాడు. ఇతడిని త్వరగా అవుట్ చేయకపోతే చెన్నై బౌలింగ్ అటాక్ కుప్పకూలడం ఖాయం.

చెన్నైపై యశస్వి జైస్వాల్‌ రికార్డు

ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఏదో తెలియని ప్రేమ. ఆ జట్టుపై ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు బాది 161 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. జైస్వాల్ ఒక్కసారి లయ అందుకుంటే స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవాల్సిందే. చెన్నై బౌలర్ల బలహీనతలను పసిగట్టి ఆడటంలో జైస్వాల్ దిట్ట.

హెట్‌మయర్ మెరుపులు.. ఆర్చర్ వేగం

వెస్టిండీస్ వీరుడు షిమ్రోన్ హెట్‌మయర్ ఇటీవలే ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. 186 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థులను భయపెట్టిన హెట్‌మయర్, ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. మరోవైపు, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన నిప్పులు చెరిగే వేగంతో చెన్నై బ్యాటర్ల అగ్నిపరీక్ష తీసుకోనున్నాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచిన ఆర్చర్, చెన్నై టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నాడు.

చెన్నై గుట్టు తెలిసిన జడేజా

అన్నింటికంటే ముఖ్యంగా రవీంద్ర జడేజా ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. చెన్నై జట్టులో దశాబ్ద కాలం పాటు ఉన్న జడేజాకు ఆ జట్టులోని ప్రతి ఆటగాడి బలం,  బలహీనత తెలుసు. చెన్నై వ్యూహాలను చిత్తు చేయడంలో జడేజా రాజస్థాన్‌కు అసలైన ట్రంప్ కార్డ్. బ్యాట్, బాల్‌తో జడేజా చేసే మ్యాజిక్ చెన్నైకి పెద్ద తలనొప్పిగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us