
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరో మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ కనిపించింది. గైక్వాడ్ గత మ్యాచ్‌లో 92 పరుగులు చేసి, కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ ఆటగాడు లక్నోపై కూడా తన బలమైన ప్రదర్శనను కొనసాగించాడు. గైక్వాడ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. రితురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. గైక్వాడ్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో లక్నో లయను దెబ్బ తీశాడు.
రితురాజ్ గైక్వాడ్ తన మూడో సిక్స్ సమయంలో మైదానంలో పార్క్ చేసిన కారును డ్యామేజ్ చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ చెన్నై ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఓవర్ రెండో బంతికి రితురాజ్ గైక్వాడ్ వరుస సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో గైక్వాడ్ నాలుగో బంతికి లాంగ్ ఆఫ్ ఓవర్ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి గైక్వాడ్ కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టగా, బంతి అక్కడ ఉంచిన కారును తాకింది. గైక్వాడ్ కొట్టిన ఈ షాట్‌కి కారుకు సైడ్ తగలడంతో కొద్దిగా సొట్ట పడింది.
Itna Bura dent
Media Credits : Jio Cinema #LSGvsCSK #CSKvLSG pic.twitter.com/kknt6HAQA0— rajendra tikyani (@Rspt1503) April 3, 2023
చెన్నైకి రితురాజ్ గైక్వాడ్ చురుకైన ఆరంభాన్ని అందించాడు. కాన్వేతో కలిసి గైక్వాడ్ పవర్‌ప్లేలో 79 పరుగులు చేశాడు. చెపాక్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాట్స్‌మెన్‌లిద్దరూ కలిసి చెన్నై స్కోరును 8 ఓవర్లలో 100 దాటించారు. కాన్వే, గైక్వాడ్ మూడోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఐపీఎల్‌లో తొలిసారిగా చెన్నై ఓపెనర్లు మూడు సెంచరీల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
Homecoming ? ? at Chepauk, courtesy @Ruutu1331.#CSKvLSG #TATAIPL #IPLonJioCinema | @ChennaiIPL pic.twitter.com/23S9Yi474A
— JioCinema (@JioCinema) April 3, 2023
ఈ ఐపీఎల్ సీజన్‌లో 100 మార్కును దాటిన తొలి ఆటగాడిగా రితురాజ్ గైక్వాడ్ నిలిచాడు. గైక్వాడ్ 2 మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేశాడు. అతని సగటు 74.50గా నిలిచింది. ఈ ప్లేయర్ స్ట్రైక్ రేట్ కూడా 183.95గా మారింది. గైక్వాడ్ 2 మ్యాచ్‌ల్లో 13 సిక్సర్లు కొట్టాడు.