IPL 2025: సీఎస్‌కే చీటింగ్‌ చేసి గెలిచిందా? బయటికొచ్చిన సంచలన వీడియో

|

Mar 24, 2025 | 3:33 PM

చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన తర్వాత, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ , బౌలర్ ఖలీల్ అహ్మద్‌లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. వైరల్‌గా మారిన వీడియోలో ఇద్దరూ అనుమానాస్పదంగా ఏదో మార్చుకుంటున్నట్లు కనిపించడంతో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

IPL 2025: సీఎస్‌కే చీటింగ్‌ చేసి గెలిచిందా? బయటికొచ్చిన సంచలన వీడియో
Csk Ball Tampering
Follow us on

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత ముంబైని కేవలం 155 పరుగులకే కట్టడి చేసిన సీఎస్‌కే ఆ తర్వాత 156 టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్‌ 2025 సీజన్‌ను చాలా గ్రాండ్‌గా మొదలుపెట్టింది. అయితే ఈ మ్యాచ్‌ తర్వాత సీఎస్‌కే ఆటగాళ్లపై బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి. సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ బాల్‌ ట్యాపరింగ్‌కు పాల్పడ్డారా? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇప్పటికే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ విషయంలో సీఎస్‌కేపై 2016, 2017లో రెండేళ్ల నిషేధం పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆరోపణలతో మరోసారి సీఎస్‌కే వివాదంలో చిక్కుకుంది. ఈ ఆరోపణలను బలపరుస్తూ.. ఓ వీడియో కూడా వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో, CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ఖలీల్ అహ్మ ఏదో చేతుల్లోకి సీక్రెట్గా మారుస్తున్నట్లు కనిపించారు. ఆ వీడియోలో, ఖలీల్ అహ్మద్ తన ప్యాంటు జేబులోంచి ఏదో తీస్తున్నట్లు చూడవచ్చు.

అలాగే, రుతురాజ్ గైక్వాడ్ దానిని అతనికి ఇచ్చిన తర్వాత, అతను దానిని తన జేబులో ఉంచుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన రహస్య సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలామంది దీనిని బాల్ ట్యాంపరింగ్ అని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద, మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా గతంలో 2 సంవత్సరాలు నిషేధించబడిన చెన్నై సూపర్ కింగ్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి, CSK ఫ్రాంచైజీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి. క్రికెట్‌ అభిమానులు కూడా ఈ వీడియోపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..