Slow Centuries: పేరుకే సెంచరీలు.. కానీ జిడ్డు బ్యాటర్లు వీరే.! ఎన్ని బంతుల్లో కొట్టారో తెలుసా..

పేరుకే ఇవి సెంచరీలు.. కానీ కొట్టినవి జిడ్డు బ్యాటర్లు.. సాధారణంగా ఫాస్టెస్ట్ సెంచరీలు చూసి ఉంటారు. ఇవి స్లో సెంచరీలు. మరి ఆ ప్లేయర్స్ ఎవరు.? ఏయే సంవత్సరాల్లో ఈ సెంచరీలు కొట్టారో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి.

Slow Centuries: పేరుకే సెంచరీలు.. కానీ జిడ్డు బ్యాటర్లు వీరే.! ఎన్ని బంతుల్లో కొట్టారో తెలుసా..
Odi Cricket

Updated on: Jan 31, 2026 | 9:50 AM

క్రికెట్‌లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌లలో నమోదైన అత్యంత స్లోయెస్ట్ సెంచరీలు ఇలా ఉన్నాయి. ఆ లిస్టులో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే.? ముదసర్ నజర్(పాకిస్తాన్) టెస్టుల్లో 419 బంతుల్లో, డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా) వన్డేలలో 166 బంతుల్లో, పాల్ స్టెర్లింగ్(ఐర్లాండ్) T20లలో 70 బంతుల్లో తమ స్లోయెస్ట్ సెంచరీలను పూర్తి చేశారు.

వివరాల్లోకి వెళ్తే..! క్రికెట్ చరిత్రలో కొన్ని సెంచరీలు వేగవంతమైనవిగా నిలిస్తే.. మరికొన్ని అత్యంత నెమ్మదైనవిగా రికార్డుల్లోకి ఎక్కాయి. టెస్ట్, వన్డే, టీ20లలో మూడు ప్రధాన ఫార్మాట్‌లలో నమోదైన అత్యంత నెమ్మదైన సెంచరీలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీని పాకిస్తాన్ ఆటగాడు ముదసర్ నజర్ నమోదు చేశాడు. 1977లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 419 బంతులు ఎదుర్కొని ఈ రికార్డును నెలకొల్పాడు. అతని ఇన్నింగ్స్ టెస్ట్ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ చూపిన ఓర్పుకు నిదర్శనం అని చెప్పొచ్చు.

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో, ఆస్ట్రేలియన్ ప్లేయర్ డేవిడ్ బూన్ స్లోయెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 1992లో ఇండియాపై అతను 166 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ వన్డే ఫార్మాట్‌లో ఒక బ్యాట్స్‌మెన్ ఆడిన నెమ్మదైన శతకంగా నిలిచింది. ఇక, వేగవంతమైన ఫార్మాట్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో, ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టెర్లింగ్ అత్యంత నెమ్మదైన సెంచరీని నమోదు చేశాడు. 2021లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో, స్టెర్లింగ్ 70 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. T20 క్రికెట్ వేగానికి విరుద్ధంగా ఈ సెంచరీ నమోదైంది. ఈ ఆటగాళ్లు తమ ఫార్మాట్‌లలో అత్యంత నెమ్మదైన సెంచరీలను సాధించి, క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డులు నెలకొల్పారు.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..