Hardik Pandya’s Father Dead: టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా తన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న క్రునాల్ పాండ్యాకు విషయం తెలియడంతో వెంటనే ఇంటికి బయలుదేరాడు. ఈ సందర్భంగా బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈవో శిశిర్ హతంగాడి మాట్లాడుతూ.. క్రునాల్ పాండ్యా వ్యక్తిగత సంఘటన కారణంగా బయోబబుల్ నుంచి నిష్క్రమించాడని తెలిపారు. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఇంట్లోనే ఉండి ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు శిక్షణ ఇస్తున్నాడు. ముష్తాక్ అలీ ట్రోఫీలో అతడు ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.