విండీస్‌పై ఇంగ్లాండ్ సునాయాస గెలుపు!

|

Jun 15, 2019 | 6:39 AM

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం సౌథాంప్టన్ వేదిక విండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 212 పరుగులకే ఆలౌటైంది. ఇక విండీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 33.1 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.  ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్(100), బెయిర్ స్టో (45), వోక్స్ (40) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. […]

విండీస్‌పై ఇంగ్లాండ్ సునాయాస గెలుపు!
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం సౌథాంప్టన్ వేదిక విండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 212 పరుగులకే ఆలౌటైంది. ఇక విండీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 33.1 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.  ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్(100), బెయిర్ స్టో (45), వోక్స్ (40) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇకపోతే సెంచరీతో అదరగొట్టిన రూట్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.