కోహ్లీసేనకే మా మద్దతు – పాక్ అభిమానులు

వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్ రేపు ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలబడనుంది. వరుసపెట్టి విజయాలతో ఊపు మీద ఉన్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాలని తపిస్తోంది. అటు ఇంగ్లాండ్ వరుస ఓటములతో కుదేలవడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఈ మ్యాచ్ గురించి ఓ ఆసక్తికరమైన ప్రశ్నను పాక్ అభిమానులను అడిగాడు. ‘ఆదివారం జరగబోయే భారత్, ఇంగ్లాండ్ […]

కోహ్లీసేనకే మా మద్దతు - పాక్ అభిమానులు

Updated on: Jun 29, 2019 | 1:39 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్ రేపు ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలబడనుంది. వరుసపెట్టి విజయాలతో ఊపు మీద ఉన్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాలని తపిస్తోంది. అటు ఇంగ్లాండ్ వరుస ఓటములతో కుదేలవడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది.

ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఈ మ్యాచ్ గురించి ఓ ఆసక్తికరమైన ప్రశ్నను పాక్ అభిమానులను అడిగాడు. ‘ఆదివారం జరగబోయే భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో.. మీ సపోర్ట్ ఎవరికంటూ పాక్ అభిమానులను సరదాగా అడుగుతూ ట్వీట్ చేశాడు. దీనికి పాక్ ఫ్యాన్స్ కోహ్లీసేనకే మా మద్దతు అని తెలిపారు. కాగా ఓ పాక్ ఫ్యాన్ అయితే జైహింద్ అని.. మరొకరు వందేమాతరం అని కామెంట్స్ కూడా చేశారు.