IPL 2025: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు యూట‌ర్న్‌..ప్లేయర్స్‌ను ఇక్కడే ఉంచేందుకు ఓకే!

బీసీసీఐ చర్చల తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత్‌లో ఐపీఎల్‌ ఆడే తమ ప్లేయర్లు తిరిగి రావాలన్న ఆదేశాలను సౌతాఫ్రికా వెనక్కి తీసుకుంది. ఐపీఎల్‌ ప్లేఆప్స్‌, ఫైనల్స్‌ పూర్తియ్యే వరకు తమ ప్లేయర్స్‌ను భారత్‌లో ఉంచేందుకు అంగీకరించింది. భారత్‌-పాక్‌ ఉద్రిక్తల నేపథ్యంలో ఐపీఎల్‌ వాయిదా పడడంతో తమ ప్లేయర్లు తిరిగి రావాలని సౌతాప్రికా ఇటీవల తెలిపింది. ఇక దీనిపై బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత సౌతాఫ్రికా తన నిర్ణయాన్ని మార్చుకుంది.

IPL 2025: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు యూట‌ర్న్‌..ప్లేయర్స్‌ను ఇక్కడే ఉంచేందుకు ఓకే!
Ipl

Updated on: May 15, 2025 | 2:42 PM

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజల భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను బీసీసీఐ వాయిదా వేసింది.
దీంతో త్వరలో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సిద్ధం కావడానికి వెంటనే మే 26 తర్వాత తిరిగి రావాలని భారత్‌లో ఐపీఎల్‌ కోసం వచ్చిన తమ ప్లేయర్స్‌కు సౌతాఫ్రికా ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఈ నిర్ణయంపై సౌతాఫ్రికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ ప్లేఆప్స్‌, ఫైనల్స్‌ పూర్తియ్యే వరకు తమ ప్లేయర్స్‌ను భారత్‌లో ఉంచేందుకు అంగీకరించింది.

అయితే ప్రస్తుతం భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణగడంతో ఐపీఎల్‌ ప్రారంభంపై బీసీసీఐ క్లారిటీకి వచ్చింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో చర్చలు జరిపింది. ఐపీఎల్‌ పూర్తయ్యే వరకు ప్లేయర్స్ భారత్‌లోనే ఉండేలా చూడాలని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డును కోరింది. దీంతో బీసీసీఐ చర్చల పట్ల సానుకూలంగా స్పందించిందిన సౌతాఫ్రికా జూన్ 3న లీగ్ ముగిసే వరకు తమ ప్లేయర్ భారత్‌లోనే ఉండొచ్చని పేర్కొంది.

ప్రొటీస్ ఆటగాళ్లు భారతదేశంలో ప్లేఆఫ్‌లు, ఫైనల్ కోసం ఉంటే, వారికి WTC ఫైనల్స్ కోసం సన్నద్ధం కావడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాకు ప్రయోజనం కానుంది, ఎందుకంటే వారి WTC ఆటగాళ్లలో చాలామంది భారతదేశానికి తిరిగి వెళ్లకుండా ఫైనల్స్ కోసం సన్నద్ధం అవుతారు. దక్షిణాఫ్రికా జట్టుకు జూన్ 3న జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఆ మ్యాచ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..