టీ20 ప్రపంచకప్ 2021 నుంచి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీనిపై క్రికెట్ పాకిస్తాన్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది. ‘భారత అభిమానులారా, మీకు ఎలా అనిపిస్తుంది?’ అని ట్వీట్ చేసింది. ట్వీట్‌కు భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. మధ్యాహ్నం 12-1 మధ్య లంచ్ చేశాను.. ఇంకా ఫుల్‌గానే ఉన్నట్లు అనిపిస్తుందని సెటైర్ వేశాడు. అయితే ఈ ట్వీట్‌కు అర్థం చాలా మందికి తెలియలేదు. 12-1 మధ్య అంటే ఐసీసీ టీ20, వన్డే వరల్డ్ కప్‌ల్లో ఇండియా, పాక్ 13 సార్లు తలపడగా అందులో 12 సార్లు భారత్, ఒక్కసారి పాక్ విజయం సాధించింది.
Had a heavy lunch between 12-1, still feeling full ? #NZvsAfg #T20WorldCup https://t.co/wJ58RUSnh0
— Wasim Jaffer (@WasimJaffer14) November 7, 2021
ఈ ఐసీసీ మెగా టోర్నిలో భారత్ విఫలమైంది. సెమీస్‌కు వెళ్లకుండానే ఇంటి ముఖం పట్టింది. ఇండియా 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత ఐసీసీ టోర్నమెంట్లో నాకౌట్‌కు చేరుకోకపోవడం ఇదే మొదటిసారి. భారత్ తన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా గెలుపొందలేకపోయింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో కూడా ఇండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 110 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాత పుంజుకుని ఆఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్ను చిత్తు చేసింది.
Read Also… T20 World Cup 2021: భారత్ పరాజయాలకు కారణాలు విశ్లేషించిన సునీల్ గవాస్కర్.. అవి ఏమిటంటే..