
Viral Video : టీమిండియా మాజీ కెప్టెన్, కోట్లాది మంది ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముసురుకుంది. మైదానంలో అత్యంత ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ అని పేరు తెచ్చుకున్న ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై నిరంతరం నిఘా ఉంచే కెమెరాల కంటికి ఈ దృశ్యం చిక్కడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో ధోనీ కారును ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఒక కెమెరామెన్ కారు లోపలి భాగాన్ని జూమ్ చేయగా, అక్కడ సీట్ల మధ్యలో ఒక సిగరెట్ ప్యాకెట్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ధోనీ ముందు సీట్లో కూర్చోగా, వెనుక సీట్లో సాక్షి, మరొక వ్యక్తి ఉన్నారు. ఆ ప్యాకెట్ సరిగ్గా వెనుక సీటు వైపు ఉండటంతో, అది ధోనీదా లేక కారులో ఉన్న ఇతరులదా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ధోనీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఒక పార్టీలో ధోనీ హుక్కా తాగుతున్న వీడియో బయటకు వచ్చి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఒక అథ్లెట్ అయి ఉండి, లక్షలాది మంది యువతకు రోల్ మోడల్‌గా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ఏంటని కొందరు విమర్శించగా.. అది ఆయన వ్యక్తిగత ఇష్టమని మరికొందరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు తాజా వీడియోతో పాత వివాదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.
మరోవైపు టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “నేను ఎవరికీ హుక్కా సెట్ చేసి ఇచ్చేవాడిని కాదు, నా ఫోకస్ అంతా గ్రౌండ్ మీదనే ఉండేది” అని ఇర్ఫాన్ గతంలో అన్నారు. అయితే ఈ మాటలు ధోనీని ఉద్దేశించే అన్నారని నెటిజన్లు ప్రచారం చేయడంతో, ఇర్ఫాన్ క్లారిటీ ఇస్తూ.. తన పాత వీడియోను తప్పుగా వాడుతున్నారని మండిపడ్డారు.
ధోనీ వంటి సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న వస్తువులు కనిపించినా అవి పెద్ద వార్తగా మారుతుంటాయి. ఈ సిగరెట్ ప్యాకెట్ విషయంపై ధోనీ వైపు నుండి ఎలాంటి వివరణ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ధోనీ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేక ఇంకా ముదురుతుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.