క్రిస్‌గేలా మజాకా..! బ్యాట్‌ రెండు ముక్కలైంది.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

|

Sep 15, 2021 | 6:19 PM

Chris Gayle: క్రికెట్‌లో క్రిస్‌ గేల్ పేరు తెలియనివారుండరు. అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే బౌలర్లకు వణుకే. క్రీజులో ఉండే కొద్దిసేపైనా ఊచకోత కోస్తాడు.

క్రిస్‌గేలా మజాకా..! బ్యాట్‌ రెండు ముక్కలైంది.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Chris Gayle
Follow us on

Chris Gayle: క్రికెట్‌లో క్రిస్‌ గేల్ పేరు తెలియనివారుండరు. అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే బౌలర్లకు వణుకే. క్రీజులో ఉండే కొద్దిసేపైనా ఊచకోత కోస్తాడు. పట్టపగలే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేస్తాడు. తాజాగా విండీస్‌లో జరుగుతున్న సీపీఎల్‌ 2021లో క్రిస్‌ గేల్ సెంట్‌ కిట్స్‌ త‌రుపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెంట్‌ కిట్స్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగుతోంది. ఇందులో అనూహ్య సంఘటన ఒకటి చోటుచేసుకుంది. షాట్‌కి యత్నించిన క్రిస్‌గేల్ బ్యాట్‌ రెండు ముక్కలైంది.

సెంట్‌ కిట్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ను ఒడియన్ స్మిత్ వేశాడు. ఓవర్‌ రెండో బంతిని స్మిత్ లెగ్‌స్టంప్‌ దిశగా వేశాడు. గేల్‌ దానిని ఆఫ్‌సైడ్‌ ఆడుదామని భావించాడు. అయితే బంతి బ్యాట్‌కు బలంగా తగలడంతో రెండు ముక్కలైంది. బ్యాట్‌ కింద పడిపోగా.. హ్యాండిల్‌ మాత్రం గేల్‌ చేతిలో ఉండిపోయింది. ఆ తర్వాత గేల్‌ పడిపోయిన బ్యాట్‌ను పరిశీలించి కొత్త బ్యాట్ తెప్పించుకొని ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. అయితే బ్యాట్‌ విరిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్‌ కిట్స్‌ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ లూయిస్‌ (39 బంతుల్లో 77 నాటౌట్‌, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్‌ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు.

Sonu Sood: సోనూసూద్ నివాసంలో ఐటీ సోదాలు.. ఇల్లు, ఆఫీస్ సహా 6 చోట్ల తనిఖీలు

Xiaomi Smart Glasses: ఫేస్‌బుక్‌కు ధీటుగా రంగంలోకి దిగిన షావోమీ… సరికొత్త స్మార్ట్‌ గ్లాసెస్‌ రూపకల్పన.

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. అర్హతలు.. దరఖాస్తు చేసుకునే విధానం ఇలా..