CSK vs MI IPL 2021: కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబయి ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబయి జట్టు మొదటి నుంచి తడబడింది. ముంబయి ఇన్నింగ్స్‌లో తివారి(50) ఒక్కడే అర్థ సెంచరీతో అజేయంగా నిలిచాడు. డికాక్ 17, సింగ్ 16, సూర్య కుమార్ యాదవ్ 3, ఇషాన్ కిషన్ 11, పొలార్డ్ 15, పాండ్యా 4, మిల్నే 15 పరుగులు చేశారు. చెన్నై టీం బౌలర్లలో బ్రావో 3, దీపక్ చాహర్ 2, హజల్ వుడ్, శార్దుల్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో చెన్నై విజయాన్ని అందుకుంది.
ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ధోనీ(3), రైనా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్(88) ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.
The team and the WIN! ?#CSKvMI #WhistlePodu #Yellove ?? pic.twitter.com/sOXh6eKm0P
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) September 19, 2021