Dhoni Fined For Slow Over Rate: ఐపీఎల్ 2021లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ ముందు ఉంచినా ఢిల్లీ జట్టు అవలీలగా లక్ష్యం చేధించింది. దీంతో టోర్నీలో ఢిల్లీ శుభారంభం చేయగా చెన్నై ఓటిమితో టోర్నీ ప్రారంభించాల్సి వచ్చింది.
ఇలా ఓ వైపు ఓటమితో బాధపడుతుంటే ధోని జట్టుకు మరో షాక్ తగిలింది. వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనికి భారీ జరిమాన విధించారు. ‘శనివారం రాత్రి వాంకడేలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే టీమ్ స్లో ఓవర్ రేట్‌ను కనబరించింది. ఈ కారణంగానే ధోనికి రూ.12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ మీడియాకు ఇచ్చిన వివరణలో వెల్లడించింది.
ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం పట్ల ధోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమంలో మ్యాచ్‌లో విఫలం చెందడం పట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభం కావడంతో ప్రత్యర్థి జట్టు మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ పిచ్ చాలా పేలవంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ కష్టంగా మారింది. ఇక్కడ మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పిచ్‌పై డ్యూ (తేమ) కనబడింది. అది తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుంది. పిచ్‌పై మంచు ఉంటే అది ఛేజింగ్ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఎప్పుడైనా తేమ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. ఇంకా 15-20 పరుగులు చేస్తే బాగుండేది. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్ ఒక గుణపాఠం’ అని చెప్పుకొచ్చాడు ధోని. ఇక ఢిల్లీ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేశారు. ఈ తరహా పిచ్‌పై ఏ బంతులు వేయాలో అవే వేసి విజయవంతమయ్యారు. మా ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బంతులు నిజంగా అద్భుతం’ అని ధోని పేర్కొన్నాడు.
ఆసియా క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు