Video: మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. మరెందుకు ఆలస్యం.. ఈ హైలైట్స్‌ వీడియో చూసేయండి..

|

Jun 30, 2024 | 10:55 AM

T20 World Cup 2024 Final Match Highlights Video: రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. దాదాపుగా చేజారిపోయిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఆఖర్లో అత్యద్భుతంగా ఒడిసి పట్టింది. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకు థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా సాగిన హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను మలుపు తిప్పితే.. హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా తనదైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో ఏకంగా కప్‌‌‌‌‌‌‌‌నే పట్టేశాడు.

Video: మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. మరెందుకు ఆలస్యం.. ఈ హైలైట్స్‌ వీడియో చూసేయండి..
Ind Vs Sa Highlights Video
Follow us on

T20 World Cup 2024 Final Match Highlights Video: రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. దాదాపుగా చేజారిపోయిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఆఖర్లో అత్యద్భుతంగా ఒడిసి పట్టింది. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకు థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా సాగిన హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను మలుపు తిప్పితే.. హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా తనదైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో ఏకంగా కప్‌‌‌‌‌‌‌‌నే పట్టేశాడు. ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ మినహా మిగతా వారంతా ఫెయిలయ్యారు. తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే కోహ్లీ మూడు ఫోర్లతో దూకుడు చూపెట్టినా.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో వరుస వికెట్లు పడ్డాయి. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తరువాత విజృంభించాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు.

కోహ్లీకి తోడు.. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ సునామీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. కోహ్లీ నెమ్మదించినా.. అక్షర్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఫలితంగా మొదటి పది ఓవర్లలో స్కోరు 75/3కి చేరింది. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎక్కువగా స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ చేసిన అక్షర్‌‌‌‌‌‌‌‌.. రబాడ, షంసిని టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసి మళ్లీ సిక్సర్లు బాదాడు. కానీ 14వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అనూహ్యంగా రనౌట్‌‌‌‌‌‌‌‌ కావడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు కోహ్లి-అక్షర్‌ 72 పరుగుల‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది.

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా వణికించినా ఆఖర్లో మన బౌలర్లు అద్భుతం చేశారు. వరుస ఓవర్లలో బుమ్రా, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌.. హెండ్రిక్స్‌‌‌‌‌‌‌ , మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో 12/2తో కష్టాల్లో పడిన ప్రొటీస్‌‌‌‌‌‌‌‌ను డికాక్‌‌‌‌‌‌‌‌, ట్రిస్టాన్‌‌‌‌‌‌‌‌ స్టబ్స్‌‌‌‌‌‌‌‌ కాసేపు ఆదుకున్నారు. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో డికాక్‌‌‌‌‌‌‌‌ రెండు ఫోర్లతో స్టబ్స్‌‌‌‌‌‌‌‌ ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో కుదురుకున్నారు.

చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా.. ఆ ఓవర్ ను అద్భుతంగా వేసి.. టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. బౌండ్రీలైన్‌‌ దగ్గర తన బాడీని బ్యాలెన్స్‌‌ చేసుకుంటూ వాయువేగంతో బాల్‌ను అందుకున్నాడు. తను క్యాచ్ మిస్ చేస్తే ఆ బాల్ సిక్స్‌‌గా వెళ్లేది.

టీమిండియా ఆటగాళ్లు కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా చివరి బంతి విసరగానే.. రోహిత్ శర్మ మైదానంలో పడిపోయి నేలను కసిదీరా కొడుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు.

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు ఇదే చివరి ఈవెంట్. ఈ వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లు ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలికినట్టయింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ద్రావిడ్ ను టీమిండియా ఆటగాళ్లు పైకెత్తి అభినందించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..