IPL 2023 Playoff: మరో 14 మ్యాచ్‌లే.. ఆసక్తిరేపుతోన్న ప్లేఆఫ్‌ లిస్ట్.. ఆ 4 టీంలు ఏవంటే?

|

May 12, 2023 | 1:13 PM

IPL 2023 Playoff Scenario: ఐపీఎల్ 2023 లీగ్ దశలో మరో 14 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేదు.

IPL 2023 Playoff: మరో 14 మ్యాచ్‌లే.. ఆసక్తిరేపుతోన్న ప్లేఆఫ్‌ లిస్ట్.. ఆ 4 టీంలు ఏవంటే?
Follow us on

IPL 2023 Playoff Qualification Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 14 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేదు. అయితే, గుజరాత్ టీంకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకున్నట్లేనని తెలుస్తోంది.

ఈరోజు గుజరాత్, ముంబైల పోరుతో తేలేనా?

ఈరోజు ఐపీఎల్ 2023లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డులకెక్కుతుంది. మరోవైపు ముంబై గెలిస్తే రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం గుజరాత్ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ముంబై 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

చెన్నై రెండో, రాజస్థాన్ మూడో స్థానంలో..

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే చెన్నై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో గెలవాలి. మరోవైపు చెన్నై జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

లక్నో, బెంగళూరులకు అవకాశం..

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, RCB 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లూ ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే తమ మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది.

అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి ఇంకా ఏ జట్టు నిష్క్రమించలేదు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్-4కు చేరుకోవడం అసాధ్యం. మరోవైపు, పంజాబ్ కింగ్స్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే అర్హత సాధించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..