Charu Sharma, IPL Auction 2022: వేలం పాట నిర్వహిస్తున్న చారు శర్మ ఎవరో తెలుసా..

IPL Auction 2022: ప్రముఖ కామెంటేటర్, టీవీ ప్రజెంటేటర్ చారు శర్మ వేలం నిర్వాహకుడిగా మారిపోయాడు. రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)15వ ఎడిషన్ వేలంపాటలో మెరిశారు.

Charu Sharma, IPL Auction 2022: వేలం పాట నిర్వహిస్తున్న చారు శర్మ ఎవరో తెలుసా..
Charu Sharma Ipl 2022

Updated on: Feb 12, 2022 | 5:55 PM

ప్రముఖ కామెంటేటర్, టీవీ ప్రజెంటేటర్ చారు శర్మ వేలం నిర్వాహకుడిగా మారిపోయాడు. రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)15వ ఎడిషన్ వేలంపాటలో మెరిశారు. లంచ్ విరామం తర్వాత పునఃప్రారంభమైన ఐపీఎల్ వేలంపాటను ఆయనే కొనసాగించారు. అప్పటిదాకా ఆక్షనీర్‌గా కనిపించిన హ్యూ ఎడ్మెడెస్ స్థానంలో చారు శర్మ డయాస్ మీద కనిపించారు. ఐపీఎల్ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వేలంలో అనుకోని పరిణామంతో వాయిదా వేశారు. వేలం మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగ కోసం బిడ్డింగ్ నిర్వహిస్తోన్న సమయంలో ఎడ్మెడెస్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీనితో వేలంపాటను అర్ధాంతరంగా నిలిపివేశారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన విరామాన్ని తీసుకున్నారు. ఎడ్మెడెస్ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం.. హైపోటెన్షన్ అని తేలింది. పోస్టురల్ హైపోటెన్షన్ వల్ల ఎడ్మెడెస్ అస్వస్థతకు గురయ్యాడని డాక్టర్లు నిర్ధారించారు.

తొలుత గుండెపోటు అనే ప్రచారం సాగినప్పటికీ..కారణం అది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆయనకు హోటల్‌లోనే చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశ్రాంతి తీసుకుంటే సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. భోజన విరామం అనంతరం చారు శర్మ ఎంట్రీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. 3:30 గంటలకు వేలంపాట ఆరంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కొంత ఆలస్యమైంది. 3:45కు పునఃప్రారంభమైంది. చారు శర్మ ఆక్షనీర్‌గా కొనసాగింది.

చారు శర్మ భారతీయ వ్యాఖ్యాతగా కాకుండా, క్విజ్‌మాస్టర్‌గా కూడా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, అతను 2008 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు CEO కూడా వ్యవహరిస్తున్నారు. తొలి సీజన్‌లో విరాట్ కోహ్లీని కూడా జట్టులోకి తీసుకున్నారు. అయితే, IPL 2008లో RCB ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ తర్వాత చారు శర్మను CEO పదవి నుండి తొలగించారు. బెంగళూరు సీఈవో పదవి నుంచి తప్పుకున్న తర్వాత చారు శర్మ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. 

చారు శర్మ ఎవరు..

ప్రో కబడ్డీ లీగ్ వ్యవస్థాపకుడు చారు శర్మ. 2014లో 8 జట్లతో కూడిన ఈ లీగ్‌ని ప్రారంభించారు. అయితే, తరువాత స్టార్ ఇండియా అతని కంపెనీకి చెందిన 74 శాతం షేర్లను కొనుగోలు చేసింది. క్రికెట్‌తో పాటు కబడ్డీ, చారు శర్మ గోల్ఫ్‌పై కూడా కామెంట్సీ చేస్తుంటారు. అతను టీవీలో అనేక క్విజ్ షోలను కూడా హోస్ట్ చేశారు. చారు శర్మ తండ్రి NC శర్మ సుప్రసిద్ధ విద్యావేత్త. అతను అజ్మీర్‌లోని ప్రసిద్ధ మాయో కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.

అడ్మీడ్స్ రికార్డ్స్..

అడ్మీడ్స్ ప్రపంచవ్యాప్తంగా 2700 కంటే ఎక్కువ వేలంపాటలను నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కార్ల వేలం కూడా ఉంది. ఇందులో జేమ్స్ బాండ్ చిత్రంలో ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ కూడా ఉంది. అతను కుప్పకూలినప్పుడు శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా పేరును వేలానికి పిలిచాడు. వెంటనే వైద్యం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. 

ఇవి కూడా చదవండి: LSG IPL 2022 Auction: ఈ ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.. KL రాహుల్‌తోపాటు ఎవరున్నారో తెలుసుకోండి..

IPL 2022 Auction, Day 1, Live: వేలం అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..