Surya kumar Yadav : నోరా ఫతేహీ డ్యాన్స్ చూస్తుంటే జూమ్ చేసి సూర్య కుమార్‎ను పట్టుకున్న భార్య..తర్వాత ఏం చేసిందంటే ?

Surya kumar Yadav : క్రికెట్ మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. నిజజీవితంలో మాత్రం తన భార్య దేవిషా శెట్టి వేసిన గూగ్లీకి క్లీన్ బౌల్డ్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభ వేడుకల్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Surya kumar Yadav : నోరా ఫతేహీ డ్యాన్స్ చూస్తుంటే జూమ్ చేసి సూర్య కుమార్‎ను పట్టుకున్న భార్య..తర్వాత ఏం చేసిందంటే ?
Suryakumar Yadav Nora Fatehi Dance

Updated on: Feb 14, 2026 | 11:36 AM

Surya kumar Yadav : క్రికెట్ మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. నిజజీవితంలో మాత్రం తన భార్య దేవిషా శెట్టి వేసిన గూగ్లీకి క్లీన్ బౌల్డ్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభ వేడుకల్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యను ఆటపట్టిస్తూ దేవిషా తీసిన వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ శనివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహీ తన స్టెప్పులతో స్టేడియాన్ని ఊపేసింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఈ వేడుకను తిలకిస్తున్న మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. నోరా డ్యాన్స్‌ను చాలా శ్రద్ధగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో గ్యాలరీలో ఉన్న ఆయన భార్య దేవిషా.. తన మొబైల్ కెమెరాతో సూర్యను జూమ్ చేసి పట్టుకున్నారు.

దేవిషా తీసిన వీడియోలో ముందుగా నోరా ఫతేహీ డ్యాన్స్‌ను చూపించి, వెంటనే కెమెరాను డ్రెస్సింగ్ రూమ్ వైపు తిప్పారు. అక్కడ సూర్య చాలా తన్మయత్వంతో డ్యాన్స్ చూస్తూ కనిపించారు. దేవిషా తనను రికార్డ్ చేస్తోందని తెలుసుకున్న మరుక్షణమే సూర్య మొహం వెలిగిపోయింది. ఒక వెర్రి నవ్వు నవ్వి, భార్య వైపు చూస్తూ థమ్స్ అప్ చూపించారు. అంటే అవును.. చూస్తున్నాను.. బాగుంది కదా! అన్నట్టుగా ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు హైలైట్‌గా మారింది.

ఈ సీన్ మొత్తాన్ని పక్కనే ఉండి గమనిస్తున్న టీమిండియా అల్లరి పిడుగు ఇషాన్ కిషన్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆగలేకపోయారు. సూర్య దొరికిపోవడాన్ని చూసి ఇద్దరూ పడి పడి నవ్వారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్.. సూర్య కాళ్లను లాగుతూ అక్కడున్న తిలక్ వర్మకు కూడా ఆ సీన్ చూపించి ఆటపట్టించారు. “ఈ రాత్రికి మన కెప్టెన్ గారు హాల్‌లో సోఫా మీద పడుకోవాల్సిందే!” అంటూ నెటిజన్లు ఇన్స్టాగ్రామ్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల్లో భాగంగా నోరా ఫతేహీతో పాటు పాపులర్ సింగర్ బాద్షా కూడా తన పెర్ఫార్మెన్స్‌తో అలరించారు. ఐసీసీ చైర్మన్ జై షా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి అధికారికంగా టోర్నీని ప్రారంభించారు. 20 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారులతో కలిసి రోహిత్ స్టేజ్ మీద కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ఏదేమైనా మ్యాచ్ మొదలవ్వకముందే సూర్య దొరికిపోయిన ఈ ఫన్నీ వీడియో మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..