CPL: చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు వీరేనేమో.. కామెంట్లతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు

|

Sep 09, 2021 | 12:20 PM

Caribbean Premier League: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో మ్యాచులో హోరాహోరీగా సాగుతున్నాయి. వీటితో పాటే పలు మ్యాచుల్లో కొన్ని సరదా సంఘటనలు కూడా జరుగుతున్నాయి.

CPL: చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు వీరేనేమో.. కామెంట్లతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు
Caribbean Premier League
Follow us on

Caribbean Premier League: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో మ్యాచులో హోరాహోరీగా సాగుతున్నాయి. వీటితో పాటే పలు మ్యాచుల్లో కొన్ని సరదా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనతో సీపీఎల్ నెట్టింట్లో నవ్వులపాలవుతోంది. ఇలాంటి ఫీల్డర్లు కూడా ఉంటారా అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఫీల్డర్లు చేసిన నిర్లక్ష్యానికి ప్రత్యర్థి జట్టుకు నాలుగు పరుగుల కలిసొచ్చాయి. అయితే ఈ పరుగులు బౌండరీ వల్ల రాలేదు. కేవలం వికెట్ల మధ్య పరుగులతో వచ్చిన వంటే మీరు నమ్మగలరా..? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే అసలు విషయానికి వెళ్తే..

జమైకా తలైవాస్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మధ్య మంగళవారం ఓ మ్యాచ్‌ జరిగింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌‌లో పొలార్డ్‌ క్రీజులో నిలిచాడు. ప్రిటోరియస్‌ వేసిన నాలుగో బంతిని పొలార్డ్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్‌ మాత్రం క్యాచ్‌ను పట్టుకోలేకపోయాడు. రనౌట్‌ అయ్యే అవకాశం ఉండడంతో బౌలర్‌ వైపు బంతిని విసిరాడు. బౌలర్ మాత్రం ఆ బాల్‌ను అందుకోలేకపోయాడు. ఈ గ్యాప్‌లో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్లు పొలార్డ్‌- స్టీఫర్ట్‌ నాలుగు పరుగులు పూర్తి చేశాడు. ఓవరాల్‌గా ఈ ఓవర్‌‌లో పొలార్డ్‌- స్టీఫర్ట్‌ జంట 28 పరుగులు బాదేశారు. ఈ వీడియోను నెట్టింట్లో విడుదల చేయగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రిన్‌బాగో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది. లక్ష్య చేధనలో జమైకా తలైవాస్‌ 18.2 ఓవర్లలో కేవలం 92 పరుగులకే చేతుతెల్తేసింది.

Also Read:

T20 World Cup: పొట్టి ప్రపంచ కప్‌ టీంలో ధావన్‌కు ఇంకా ఛాన్స్ ఉందంటోన్న బీసీసీఐ.. మిగతా వారికి కూడా.. ఎలానో తెలుసా?

Dhoni-Kohli: ఆ విషయంలో కోహ్లీ కంటే ధోనినే బెటర్.. అందుకే టీమిండియాతో చేర్చారంటా..! అదేంటో తెలుసా?