వాడు బుడ్డోడు కాదయ్యా, ఆటమ్‌బాంబ్.. నేను బౌలింగ్ చేయాల్సి వస్తే..: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్

Brett Lee Comments on Vaibhav Suryavanshi: వయస్సు వివాదాలను పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ ప్రతిభను దిగ్గజాలు సైతం కొనియాడుతున్నారు. బ్రెట్ లీ ఇచ్చిన సలహా ప్రకారం అతడికి స్వేచ్ఛనిస్తే టీమిండియాకు రాబోయే రోజుల్లో తిరుగులేని మ్యాచ్ విన్నర్‌గా మారడం ఖాయం.

వాడు బుడ్డోడు కాదయ్యా, ఆటమ్‌బాంబ్.. నేను బౌలింగ్ చేయాల్సి వస్తే..: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
Brett Lee Vaibhav

Updated on: Aug 11, 2026 | 6:57 AM

Brett Lee Comments on Vaibhav Suryavanshi: తన తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వయస్సు వివాదంపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ ఘాటుగా స్పందించారు. వివాదాలకు చెక్ పెడుతూ అతడిని టీమిండియా సాధించిన అరుదైన రత్నంగా ఆకాశానికెత్తిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2026 సీజన్‌లో మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అయితే అతడి ఆట కంటే కూడా వయస్సు ఎంత అనే అంశంపైనే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు, వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ స్పందించారు. వైభవ్ వయస్సుపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ప్రపంచమంతా అతనికి నిజంగానే 15 ఏళ్లా కాదా అని ఆరా తీస్తోందని, కానీ తనకు ఆ వయస్సుతో అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. అతడికి 15 ఏళ్లున్నా, 17 లేదా 18 ఏళ్లు ఉన్నా వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్!

ఇవి కూడా చదవండి

మైదానంలో ఎదురైతే సవాల్ విసిరేవాడిని..!

ఆ కుర్రాడికి అద్భుతంగా క్రికెట్ ఆడే నైపుణ్యం ఉందంటూ ప్రశంసించిన బ్రెట్ లీ, టీమిండియాకు ఒక అరుదైన రత్నం దొరికిందని కొనియాడారు. ఒకవేళ తాను బౌలింగ్ చేస్తుంటే ఈ చిన్నోడిని ఎలా ఎదుర్కొనేవాడో సరదాగా వివరించారు. షార్ట్ బాల్స్ బాగా ఆడే బ్యాటర్లు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆసీస్ లెజెండ్, అతడి ఛాతీ పైకి గట్టిగా బౌన్సర్లు వేసేవాడినని అన్నారు. తన బౌలింగ్‌లో వైభవ్ సిక్స్ కొట్టినా సరే అస్సలు తగ్గకుండా, మళ్లీ ఇంకొక షార్ట్ బాల్ వేసి మైదానంలోనే సవాల్ విసిరేవాడినని బ్రెట్ లీ చెప్పుకొచ్చారు.

ఒత్తిడి పెంచకండి – స్వేచ్ఛగా ఆడనివ్వండి..!

వైభవ్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ క్రికెట్ విశ్లేషకులకు, అభిమానులకు బ్రెట్ లీ ఒక విజ్ఞప్తి చేశారు. ఆ చిన్న పిల్లాడిపై ఇప్పటి నుంచే విపరీతమైన అంచనాలు, ఒత్తిడి పెంచవద్దని కోరారు. అతడిని ఒక చిన్న పిల్లాడిలాగా భావించి, మైదానంలో స్వేచ్ఛగా ఆడనివ్వాలని సూచించారు. అలా స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అతడిలోని అసలైన ప్రతిభ బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు. వివాదాల జోలికి వెళ్లకుండా అతడి అద్భుత ఆటను ఆస్వాదించాలని చెప్పారు.

ఎక్కువమంది చదివింది: Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

జింబాబ్వే టూర్ లో అదరగొట్టిన వైనం..

ఐపీఎల్‌లో చెలరేగిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ సిరీస్‌తో భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఆ సిరీస్‌లోని మూడు టీ20 మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచినప్పటికీ, తదనంతరం జరిగిన జింబాబ్వే పర్యటనలో మాత్రం విమర్శకుల నోళ్లు మూయించాడు. అద్భుతమైన ప్రదర్శనతో పుంజుకొని ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ముద్దాడాడు. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంగా మారిన వైభవ్, రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us