Video: ఒకరు తుఫాన్ సెంచరీ.. మరొకరు హ్యాట్రిక్‌.. బంగ్లాలో ఇంగ్లీషోళ్ల విధ్వంసం చూస్తే వావ్ అనాల్సిందే..

Will Jacks Century and Moeen Ali Hat Trick: ఇంగ్లండ్ జట్టు భారత్‌లో టెస్టు సిరీస్ ఆడుతుండవచ్చు. అయితే, ఆ జట్టులో లేని ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నారు. చిట్టగాంగ్‌లో అద్భుతాలు చేసిన విల్ జాక్వెస్, మొయిన్ అలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. విల్ జాక్వెస్ వేగంగా సెంచరీ సాధించగా, మొయిన్ అలీ హ్యాట్రిక్‌తో 4 వికెట్లు పడగొట్టాడు.

Video: ఒకరు తుఫాన్ సెంచరీ.. మరొకరు హ్యాట్రిక్‌.. బంగ్లాలో ఇంగ్లీషోళ్ల విధ్వంసం చూస్తే వావ్ అనాల్సిందే..
Will Jacks Moeen Ali

Updated on: Feb 13, 2024 | 8:30 PM

Will Jacks Century and Moeen Ali Hat Trick: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 29వ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొమిల్లా 73 పరుగుల భారీ తేడాతో చిట్టగాంగ్ ఛాలెంజర్స్‌ను ఓడించింది. కొమిల్లా విక్టోరియన్స్ విజయంలో ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో తమ జట్టును ఏకపక్షంగా గెలిపించిన విల్ జాక్వెస్, మోయిన్ అలీ గురించి ఇప్పుడు చెబుతున్నాం. ఓపెనింగ్‌లో అద్భుత సెంచరీ చేసిన విల్ జాక్వెస్ తొలి అద్భుతం చూపించాడు. విల్ జాక్వెస్ కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి 108 నాటౌట్‌గా నిలిచాడు.

విల్ జాక్స్ స్టార్మ్..

విల్ జాక్వెస్, కొమిల్లా కెప్టెన్ లిటన్ దాస్ తో కలిసి చిట్టగాంగ్ ఛాలెంజర్స్ బౌలర్లపై విధ్వంసం చేశాడు. జాక్వెస్, లిటన్ దాస్ 7.5 ఓవర్లలో 86 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 60 పరుగులు చేసి లిటన్ దాస్ ఔటయ్యాడు. కానీ, విల్ జాక్వెస్ మరోవైపు అలాగే నిలుచున్నాడు. ఈ కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ 10 సిక్సర్లు, 5 సిక్సర్ల ఆధారంగా తన సెంచరీని పూర్తి చేశాడు. విల్ జాక్వెస్ గత 8 ఇన్నింగ్స్‌లలో 7లో ఫ్లాప్ అయ్యాడు. కానీ, మంగళవారం ఈ ఆటగాడు అద్భుతాలు చేశాడు. రెండోసారి టీ20లో సెంచరీ చేసిన జాక్వెస్ ఈ ఫార్మాట్‌లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు.

మొయిన్ అలీ హ్యాట్రిక్..


విల్ జాక్వెస్ తుఫాను సెంచరీ తర్వాత, మొయిన్ అలీ తన స్పిన్ పవర్‌ను చూపించాడు. ఓపెనింగ్ బౌలింగ్‌లో మొయిన్ అలీ 3.3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ నాలుగు వికెట్లలో మొయిన్ అలీ హ్యాట్రిక్ సాధించాడు.

ఈ ఆటగాడు మొదట 17వ ఓవర్లో షోహిదుల్ ఇస్లామ్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అతను అల్ అమీన్ హుస్సేన్ వికెట్ తీశాడు. చివర్లో, బిలాల్ ఖాన్‌ను అవుట్ చేయడం ద్వారా మొయిన్ అలీ తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చిట్టగాంగ్ ఛాలెంజర్స్ జట్టు కేవలం 166 పరుగులకే కుప్పకూలింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us