AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. అరుదైన రికార్డు సృష్టించబోతోన్న స్వింగ్ కింగ్

IPL 2026 : భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటివరకు ఏ పేస్ బౌలర్‌కు సాధ్యం కాని ఈ ఘనతను భువీ సాధించబోతుండటంతో క్రికెట్ అభిమానులు తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. అరుదైన రికార్డు సృష్టించబోతోన్న స్వింగ్ కింగ్
Bhuvneshwar Kumar
Rakesh
|

Updated on: May 07, 2026 | 4:42 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యం కాబోతోంది. టీమిండియా వెటరన్ పేసర్, ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరగనున్న మ్యాచ్‌తో భువీ తన ఐపీఎల్ కెరీర్‌లో 200వ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇప్పటివరకు ఏ పేస్ బౌలర్‌కు సాధ్యం కాని ఈ ఘనతను భువీ సాధించబోతుండటంతో క్రికెట్ అభిమానులు తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ ప్రయాణం 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే మొదలైంది. అప్పట్లో కేవలం రూ. 6 లక్షలకే అతడిని కొనుగోలు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ సీజన్ మొత్తం భువీ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా ఆర్‌సీబీ అతడిని రిలీజ్ చేసింది. ఆ తర్వాత పూణే వారియర్స్ ఇండియా ద్వారా అసలు సిసలు ఆటను చూపించిన భువీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో కలిసి స్టార్ హోదాన దక్కించుకున్నాడు. 2025 వేలంలో ఆర్‌సీబీ తన పాత తప్పును సరిదిద్దుకుంటూ ఏకంగా రూ.10.75 కోట్లు పెట్టి భువీని మళ్ళీ సొంతం చేసుకుంది.

భువనేశ్వర్ సాధించిన ఈ మైలురాయిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఐపీఎల్ చరిత్రలో ది బెస్ట్ అయిన ముగ్గురు బౌలర్లను తీసుకుంటే అందులో భువీ కచ్చితంగా ఉంటాడు. ఒక ఫాస్ట్ బౌలర్‌గా ఫిట్‌నెస్ కాపాడుకుంటూ 200 మ్యాచ్‌లు ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. భువీ ఆట పట్ల ఉన్న అవగాహన, ఎకానమీ రేట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏ సమయంలోనైనా కెప్టెన్ నమ్మదగ్గ బౌలర్ భువీ” అని కొనియాడాడు.

ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ 199 మ్యాచ్‌లలో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ కూడా అతడే కావడం విశేషం. ఈ 2026 సీజన్లో భువీ మళ్ళీ తన పాత ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. గతంలో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన రికార్డు కూడా భువీ సొంతం. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తే మూడోసారి పర్పుల్ క్యాప్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టగానే భువనేశ్వర్ కుమార్ తన 200వ ఐపీఎల్ మ్యాచ్‌ను పూర్తి చేసుకుంటాడు. ఒక పేసర్ ఇంత సుదీర్ఘ కాలం పాటు ఒకే స్థాయిలో రాణించడం భారత్ తరపున ఒక గొప్ప రికార్డు. స్వింగ్ సుల్తాన్ గా పేరుగాంచిన భువీ, డెత్ ఓవర్లలో కూడా యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట. నేడు తన 200వ మ్యాచ్ లో భువీ వికెట్ల పండగ చేసుకుంటాడని ఆర్‌సీబీ అభిమానులు ఆశీస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us