Gold Chain Controversy : రూ.9 లక్షల గోల్డ్ చైన్ గొడవ.. హీరోయిన్ కు లీగల్ నోటీస్ పంపిన క్రికెటర్

Gold Chain Controversy : శ్రీలంక క్రికెట్‌లో ప్రస్తుతం ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ దేశ స్టార్ క్రికెటర్ భానుక రాజపక్సే, ప్రముఖ హీరోయిన్ హర్షీ రసంగ మధ్య మొదలైన గోల్డ్ చైన్ గొడవ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. ఒక బంగారు గొలుసు చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం, చివరకు ఆమె అరెస్టు వరకు వెళ్లడం క్రీడా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది

Gold Chain Controversy : రూ.9 లక్షల గోల్డ్ చైన్ గొడవ.. హీరోయిన్ కు లీగల్ నోటీస్ పంపిన క్రికెటర్
Bhanuka Rajapaksa Vs Harshi Rasanga

Updated on: Apr 02, 2026 | 10:39 AM

Gold Chain Controversy : శ్రీలంక క్రికెట్‌లో ప్రస్తుతం ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ దేశ స్టార్ క్రికెటర్ భానుక రాజపక్సే, ప్రముఖ హీరోయిన్ హర్షీ రసంగ మధ్య మొదలైన గోల్డ్ చైన్ గొడవ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. ఒక బంగారు గొలుసు చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం, చివరకు ఆమె అరెస్టు వరకు వెళ్లడం క్రీడా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్సే తన వద్ద ఉన్న సుమారు రూ.9 లక్షల విలువైన బంగారు గొలుసును నటి హర్షీ రసంగకు తాత్కాలికంగా ఇచ్చారు. అయితే ఆమె ఆ గొలుసును భానుకకు చెప్పకుండానే తనఖా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజపక్స లాయర్లు ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. నోటీసులకు ఆమె స్పందించకపోవడంతో, క్రికెటర్ ఫిర్యాదు మేరకు తలంగమ పోలీసులు రంగంలోకి దిగి నటిని అరెస్ట్ చేశారు.

అరెస్టయిన హర్షీని కడువెల మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సమయంలో ఆమె తరపు లాయర్లు.. క్రికెటర్ అనుమతి లేకుండా గొలుసును తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. త్వరలోనే ఆ గొలుసును విడిపించి రాజపక్సకు తిరిగి ఇచ్చేస్తామని కోర్టులో హామీ ఇచ్చారు. దీంతో కోర్టు ఆమెకు రూ.5 లక్షల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. అయితే, జైలు నుంచి బయటకు రాగానే హర్షీ రసంగ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి సోషల్ మీడియాలో బాంబు పేల్చింది.

బెయిల్ పై విడుదలైన తర్వాత హర్షీ రసంగ సరికొత్త కథనాన్ని తెరపైకి తెచ్చారు. తామిద్దరం గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఆ సమయంలోనే భానుక ఆ బంగారు గొలుసును తనకు కానుకగా ఇచ్చారని ఆమె వాదించడం మొదలుపెట్టారు. ప్రేమించి ఇచ్చిన వస్తువును ఇప్పుడు దొంగతనం కింద మార్చడం తగదని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ వివాదం వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకుంది.

నటి చేసిన లవ్ అఫైర్ వ్యాఖ్యలపై భానుక రాజపక్స ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, కోర్టు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆ బంగారు గొలుసును తదుపరి విచారణ సమయానికి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 22న జరగనుంది. అప్పటివరకు ఈ గోల్డ్ చైన్ మిస్టరీ శ్రీలంక మీడియాలో సెన్సేషన్‌గా కొనసాగేలా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us