బాబు బంగారం.! 30 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేశాడు.. 8వ నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

కర్ణాటకలో జరుగుతున్న మహారాజా T20 ట్రోఫీ మ్యాచ్‌లో ఓ ఆటగాడి అద్భుత ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా.. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమైన వేళ.. కేవలం 67 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన తరుణంలో ఈ బ్యాట్స్‌మెన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

బాబు బంగారం.! 30 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేశాడు.. 8వ నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
Cricket

Updated on: Aug 15, 2025 | 11:30 AM

జట్టు ఏదైనా, మ్యాచ్ ఎలాంటిదైనా.. టాప్ ఆర్డర్ లేదా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం సర్వసాధారణం. కానీ ఇక్కడ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అరుదుగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం జట్టు కంటే ఎక్కువ పరుగులు చేయడమే కాదు.. హాఫ్ సెంచరీతో అలరించాడు. కర్ణాటకలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ మ్యాచ్‌లో ఈ ఫీట్ జరిగింది. గుల్‌బర్గా మిస్టిక్స్ ఎనిమిదో నెంబర్ బ్యాటర్ లావిష్ కౌశల్ తుఫాను అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి జట్టులోని మిగిలిన 10 మంది బ్యాట్స్‌మెన్ల కంటే ఎక్కువగా పరుగులు చేశాడు.

మైసూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ బౌలింగ్ ముందు గుల్బర్గా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, కెప్టెన్ శుభంగి హెగ్డే గుల్బర్గా టాప్, మిడిల్ ఆర్డర్‌ను నాశనం చేశారు. కేవలం 41 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి. ఆ సమయంలో లావిష్ కౌశల్ బరిలోకి వచ్చాడు. అతడి కళ్లముందే మరో 3 వికెట్లు కూడా పడిపోయాయి. దీంతో టీం స్కోరు 9 వికెట్లకు 67 పరుగులు మాత్రమే.

లావిష్ విధ్వంసం..

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ లావిష్ పట్టు వదలకుండా.. పరుగులు రాబట్టాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. గుల్బర్గా 19.5 ఓవర్లలో 112 పరుగులు చేయగలిగింది. విశేషమేమిటంటే గుల్బర్గా జట్టులోని మిగిలిన 10 మంది బ్యాట్స్‌మెన్లు 51 పరుగులు మాత్రమే చేయగలిగారు. 7 పరుగులు వైడ్లు, లెగ్ బైల రూపంలో వచ్చాయి.

బెంగళూరు గెలిచింది..

లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది, అందులో 4 వికెట్లు బౌలర్ వైషక్ పడగొట్టాడు. అయితేనేం బెంగళూరు 15వ ఓవర్‌లో లక్ష్యాన్ని చేరుకుంది. ఇక్కడ ఆసక్తికర విశేషమేమిటంటే.. గుల్బర్గాకు చెందిన లావిష్ లాగే, బెంగళూరుకు చెందిన ఎల్ఆర్ చేతన్ తమ జట్ల తరపున ఒంటరి పోరాటం చేశారు. ఓపెనర్‌గా వచ్చిన చేతన్ జట్టు 113 పరుగులలో 75 పరుగులు(నాటౌట్) చేశాడు. మిగిలిన 6 మంది బ్యాట్స్‌మెన్లు కలిసి 34 పరుగులు మాత్రమే చేయగలిగారు.

ఇది చదవండి: అంతా గంభీర్ మాయ.! గిల్‌తో పాటు ఆ 5గురు ఆసియా కప్ నుంచి అవుట్.. బుల్డోజర్ ఎంట్రీ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..