కివీస్‌కు తండ్రి ఆరాటం.. ఇంగ్లాండ్‌కు కొడుకు పోరాటం!

| Edited By: Pardhasaradhi Peri

Jul 15, 2019 | 8:59 PM

లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించి.. 27 ఏళ్ళ తర్వాత వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడారు. ఇక ఆతిధ్య ఇంగ్లాండ్ గెలుపులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మెయిన్  మ్యాచ్‌తో పాటు సూపర్ ఓవర్‌లో కూడా ఇంగ్లాండ్ కోసం పూర్తిగా పోరాడాడు. ఇది ఇలా ఉంటే న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగిన అతడి తండ్రి గెరార్డ్ స్టోక్స్ కివీస్ గెలుపు కోసం తీవ్రంగా […]

కివీస్‌కు తండ్రి ఆరాటం.. ఇంగ్లాండ్‌కు కొడుకు పోరాటం!
Follow us on

లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించి.. 27 ఏళ్ళ తర్వాత వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడారు. ఇక ఆతిధ్య ఇంగ్లాండ్ గెలుపులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మెయిన్  మ్యాచ్‌తో పాటు సూపర్ ఓవర్‌లో కూడా ఇంగ్లాండ్ కోసం పూర్తిగా పోరాడాడు. ఇది ఇలా ఉంటే న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగిన అతడి తండ్రి గెరార్డ్ స్టోక్స్ కివీస్ గెలుపు కోసం తీవ్రంగా ప్రార్ధించాడు.

లార్డ్స్ మైదానంలో ప్రత్యక్షంగా చూసిన అతడు.. తన దేశం గెలవాలని ప్రతి క్షణం తాపత్రయపడ్డాడు. అయితే చివరికి విజయం ఇంగ్లాండ్‌ను వరించగా.. ఇంగ్లీష్ టీమ్ కోసం అతడి కొడుకు బెన్ స్టోక్స్ చేసిన పోరాటాన్ని చూసి మాత్రం తెగ మురిసిపోయాడు. మరోవైపు అంపైర్ల తప్పిదం వల్లే ఇంగ్లాండ్ గెలిచిందని చాలామంది అభిమానులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.