ఐపీఎల్‌లో అమ్ముడిపోని ప్లేయర్‌.. టీమిండియాపై షాకింగ్‌ కామెంట్స్‌! బుమ్రాని అంత మాట అనేశాడు..

|

Mar 20, 2025 | 12:02 PM

ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ళలో బెన్ డకెట్ కూడా ఉన్నాడు. అనంతరం, టీమ్ ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బుమ్రా బౌలింగ్‌కు భయం లేదని, అతను ఇంగ్లాండ్‌కు పెద్దగా ప్రమాదం కలిగించలేడని డకెట్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఐపీఎల్‌లో అమ్ముడిపోని ప్లేయర్‌.. టీమిండియాపై షాకింగ్‌ కామెంట్స్‌! బుమ్రాని అంత మాట అనేశాడు..
Jasprit Bumrah
Follow us on

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం జరిగిన మెగా వేలంలో చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ఏ ఫ్రాంచైజ్‌ కూడా వారిని కొనేందుకు ఆసక్తి చూపించలేదు. అలా అమ్ముడిపోని లిస్ట్‌లో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ బెన్‌ డకెట్‌ కూడా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదనే అక్కసో ఏమో కానీ, తాజాగా టీమిండియాతో పాటు బుమ్రా గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ గురించి తనకు అంతగా భయం లేదని, అయినా బుమ్రాకు ఎవరు భయపడటం లేదంటూ బోల్డ్‌ కామెంట్స్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడాను. సో.. అతని బౌలింగ్‌ వేరియన్స్‌ గురించి నాకు మంచి అవగాహన ఉంది.

సో వచ్చే టెస్ట్‌ సిరీస్‌లో బుమ్రా మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేడు అని అన్నాడు. అలాగే టెస్టు సిరీస్‌లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామంటూ కూడా హెచ్చరించాడు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ మూడ్‌లో ఉంటే.. బెన్‌ డకెట్‌ మాత్రం ఐపీఎల్‌ తర్వాత జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌ గురించి ఇప్పడి నుంచే ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. పైగా బుమ్రా లాంటి టాప్‌ క్లాస్‌ బౌలర్‌ని పట్టుకొని.. అతను పెద్దగా ప్రభావం చూపలేడంటూ.. కాస్త గిల్లుకునే కామెంట్స్‌ చేశాడు.

ఫీల్డ్‌లో కాస్త అతి చేస్తేనే బుమ్రా తన విశ్వరూపం చూపిస్తాడు, ఇక తనను సాధారణ బౌలర్‌లా పరిగణిస్తూ, బహిరంగంగా కామెంట్స్‌ చేస్తే ఊరుకుంటాడా? తన బెస్ట్‌ను బయటికి తీస్తాడు, ఇంగ్లండ్‌ పిచ్‌లపై బుమ్రా స్పీడ్‌కు, యార్కర్లకు, లైన్‌ అండ్‌ లెంత్‌కు ఇంగ్లండ్‌ బ్యాటర్లు వణికిపోవాల్సిందే అంటూ టీమిండియా క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కాగా ఐపీఎల్‌ ముగిసిన తర్వాత జూన్‌ 20 నుంచి జూలై 25 వరకు టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అప్పటి వరకు బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటే.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే అంటూ ఫ్యాన్స్‌, బెన్‌ డకెట్‌ కామెంట్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..