New Zealand Tour of India: కొత్త కోచ్, టీ20 కెప్టెన్, కివీస్ సిరీస్ స్వ్కాడ్ ఎంపికలో సెలక్టర్లు బిజీ.. రెండు రోజుల్లో బీసీసీఐ నిర్ణయం

India vs New Zealand: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు భారత జట్టు జాతీయ సెలక్షన్ కమిటీ రెండు రోజుల్లో సమావేశం కానుంది.

New Zealand Tour of India: కొత్త కోచ్, టీ20 కెప్టెన్, కివీస్ సిరీస్ స్వ్కాడ్ ఎంపికలో సెలక్టర్లు బిజీ.. రెండు రోజుల్లో బీసీసీఐ నిర్ణయం
Bcci

Updated on: Nov 02, 2021 | 9:57 AM

New Zealand Tour of India: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు భారత జట్టు జాతీయ సెలక్షన్ కమిటీ రెండు రోజుల్లో సమావేశం కానుంది. ప్రస్తుత ఆల్-ఫార్మాట్ లీడర్ విరాట్ కోహ్లీ, టీ20 ప్రపంచ కప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్నీ నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. చేతన్ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ కొత్త ట్వంటీ 20 సారథిని ఎంచుకోవడంతో పాటు కివీస్ జట్టును ఎంచుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుత వైస్-కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన పోటీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆటగాళ్లు ఏప్రిల్ నుంచి నిరంతరంగా క్రికెట్ ఆడుతున్నందున 3 ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఐపిఎల్, తరువాత డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్, ఇప్పుడు ట్వంటీ-20 ప్రపంచకప్ ఇలా నిరంతరంగా క్రికెట్ ఆడుతున్నారు.

కోహ్లి టీ20ఐ ఫార్మాట్ కెప్టెన్సీని మాత్రమే వదులుకున్నప్పటికీ, వైట్-బాల్ ఫార్మాట్లలో స్ప్లిట్ కెప్టెన్సీపై కూడా చర్చ జరుగుతోంది. ఇద్దరు సెలెక్టర్లు – ఛైర్మన్ చేతన్ శర్మ, సభ్యుడు అబే కురువిల్లా దుబాయ్‌లో ఉన్నారు. మిగిలిన వారంతా భారతదేశంలో ఉన్నారు.

టూర్‌కు ఎంపిక చేయాల్సిన ఆటగాళ్లు రెండు రోజుల ప్రాక్టీస్‌కు ముందు ఐదు రోజుల క్వారంటైన్‌లో ఉండేందుకు నవంబర్ 10లోగా రిపోర్టు చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది. కాగా, భారత తదుపరి ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించిన లాంఛనాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆ పదవికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రాహుల్ ద్రవిడ్ కూడా అప్పటికి వారితో చేరే అవకాశం ఉంది. సహాయక సిబ్బందిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ప్రధాన కోచ్ పదవికి గడువు అక్టోబర్ 26తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఇతర కోచ్‌లు (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కోసం దరఖాస్తుల సమర్పణకు గడువు నవంబర్ 3గా నిర్ణయించారు. వీరందరికీ ఇంటర్వ్యూలు నవంబర్ 10న నిర్వహించనున్నారు. కొంతమంది నాన్-క్రికెటర్ల నుంచి కూడా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

రాబోయే వారంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రధాన్ కోచ్ నియామకం ఇప్పటికే పూర్తయినా.. ఇంటర్వ్యూ నామమాత్రంగా చేయాల్సి ఉంది. క్రికెట్ సలహా కమిటీ (CAC) సభ్యులలో ఒకరైన మదన్ లాల్ తన పదవీకాలం పూర్తి కావడంతో ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో పూర్తి చేయలేదు.

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా నవంబర్ 17న జైపూర్‌లో టీ20ఐతో ప్రారంభించి, నవంబర్ 19 (రాంచీ), నవంబర్ 21 (కోల్‌కతా)తో మూడు టీ20ల సిరీస్ ముగిసయనుంది. అనంతరం రెండు టెస్టులు నవంబర్ 25-29 (కాన్పూర్), డిసెంబర్ 3-7 (ముంబై) వరకు జరగనున్నాయి.

Also Read: Indian Cricket Team: టీమిండియా వైఫల్యానికి ఐసీసీ, బీసీసీఐల హస్తం.. పేలవ ప్రదర్శనకు అసలు కారణాలు ఇవే..!

PAK vs NAM, T20 World Cup, LIVE Streaming: ఫుల్ జోష్‌లో పాకిస్తాన్.. బాబర్ సేన ధాటికి నమీబియా నిలిచేనా?