BCCI vs ECB: మాంచెస్టర్‌లో జరగాల్సిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ టెస్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ రద్దు కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోయింది. ఓ అంచనా ప్రకారం, ఈ మొత్తం నష్టం రూ. 407 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ రద్దు తర్వాత ఈసీబీ ఈ మొత్తాన్ని బీసీసీఐ నుంచి డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో, భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి, జే షా ఇంగ్లండ్ నష్టాన్ని భర్తీ చేసేందుకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు.
జైషా ఇచ్చిన ఆఫర్ మేరకు భారత్‌తో ఇంగ్లండ్ టీ 2 టీ 20 లేదా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటం అని తెలుస్తోంది. వాస్తవానికి, వచ్చే ఏడాది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో భారత్ ఆడాల్సిన టీ20ల సంఖ్య కంటే మరో రెండు టీ20లు అదనంగా ఆడటం.. లేదా ఓ టెస్ట్ అదనంగా ఆడవచ్చనే ప్రతిపాదనను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మర ఈసీబీ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తుందా లేదో చూడాలి. ప్రస్తుతానికైతే బంతి ఈసీబీ కోర్టులో ఉందని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు భారత్..
వచ్చే ఏడాది జులైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ పర్యటనలో, టీమిండియా 3 టీ 20లు, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. జులై 1 న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే టీ 20 మ్యాచ్‌తో ఇంగ్లండ్ పర్యటన ప్రారంభమవుతుంది. రెండవ టీ 20 జులై 3 న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతుంది. మూడో టీ 20 జులై 6 న జరుగుతుంది. దీని తరువాత, 3 వన్డేల సిరీస్ జులై 9, 12, 14 తేదీలలో జరుగుతాయి.
ఈసీబీకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చాం: జై షా
వచ్చే ఏడాది, టీమిండియా ఇంగ్లండ్ పర్యటన గురించి క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. “ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఓ ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, 3 టీ 20 లకు బదులు 5 టీ 20 ల సిరీస్ ఆడతాం. టీ20లు వద్దనుకున్నప్పుడు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకావం ఇచ్చాం. ఈ రెండు ఆఫర్లలో ఏది ఈసీబీ ఎంచుకుంటుందో చూడాలి’ అంటూ జైషా పేర్కొన్నారు.
Also Read: Sourav Ganguly: 8 ఏళ్ల కరవును తీర్చేందుకే ధోనీని మెంటార్‌గా తీసుకున్నాం: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ
IPL 2021: కోహ్లీ టీం జెర్సీ మారింది.. కేకేఆర్‌తో పోరుకు మాత్రమేనట.. ఎందుకో తెలుసా?