IND vs ZIM: జడేజా వారసుడు ఇతడే.. జింబాబ్వే టూర్‌లో సంచలనాలకు సిద్ధమైన యువ ఆల్ రౌండర్.. ఎవరంటే?

|

Jul 05, 2024 | 1:36 PM

Ravindra Jadeja Replacement in T20I: టీమ్ ఇండియా ప్రముఖ ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌ గెలిచిన వెంటనే జడేజా ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. తొలుత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ తర్వాత జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

IND vs ZIM: జడేజా వారసుడు ఇతడే.. జింబాబ్వే టూర్‌లో సంచలనాలకు సిద్ధమైన యువ ఆల్ రౌండర్.. ఎవరంటే?
Washibgton Sundar Jadeja
Follow us on

Ravindra Jadeja Replacement in T20I: టీమ్ ఇండియా ప్రముఖ ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌ గెలిచిన వెంటనే జడేజా ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. తొలుత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ తర్వాత జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత భారత జట్టులో భారీ లోటు కనిపిస్తుంది. మూడు విభాగాల్లోనూ జడేజా కీలక పాత్ర పోషించాడు. స్పిన్ బౌలింగ్‌తో పాటు, అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన షాట్లు కూడా ఆడాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడంలో ప్రవీణుడు. అతని ఫీల్డింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. జడేజా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 74 మ్యాచ్‌ల్లో 515 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 54 వికెట్లు తీశాడు.

వాషింగ్టన్ సుందర్ టీ20లో జడేజాను భర్తీ చేసే ఛాన్స్..

ఇప్పుడు టీ20లో జడేజా తర్వాత అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నగా మారింది. అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉన్నాడు. అతను ఆడటం ఖాయం. అయితే టీమ్ ఇండియాకు వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది. జడేజాలాగే సుందర్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమర్థుడు. అతనికి చాలా అనుభవం ఉంది. ఇంతకు ముందు కూడా టీమ్ ఇండియాకు ఆడాడు. వాషింగ్టన్ సుందర్ భారత్ తరపున ఇప్పటివరకు మొత్తం 4 టెస్టులు, 19 వన్డేలు, 43 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. దీంతో అతడు భారత జట్టుకు కొత్త కాదని అర్థమవుతోంది.

ఇప్పటి వరకు జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్ ఉండటంతో సుందర్ జట్టులో చోటు దక్కించుకోలేక పోయినా ఇప్పుడు సువర్ణావకాశం వచ్చింది. ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న అతను అక్కడ బాగా రాణిస్తే రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా ఎదగగలడు. అక్షర్ పటేల్ రేసులో ముందంజలో ఉండవచ్చు. కానీ, వాషింగ్టన్ సుందర్ కూడా బలమైన వాదనను వినిపించవచ్చు. ఇప్పుడు అతనికి భారత జట్టులో అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జింబాబ్వేతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌కి టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్/తుషార్ దేశ్‌పాండే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..